Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుమ్రాపై నా అంచనా తప్పింది: ఫిట్‌నెస్‌పై కోహ్లీకే కపిల్ మద్దతు

హైదరాబాద్: టీమిండియా ప్రధాన బౌలర్లలో ఒకడైన జస్ప్రిత్‌ బుమ్రాపై తనకు తొలినాళ్లలో ఉన్న అభిప్రాయం తప్పని నిరూపితమైందని మాజీ దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ స్పష్టం చేశాడు. బుమ్రా వచ్చిన కొత్తలో అతని యాక్షన్ చూసి ఎక్కువ కాలం అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగడం కష్టమనుకున్నానని, అది తప్పని ఆ తర్వాత అతడు నిరూపించాడని కపిల్ అన్నాడు.

'భారత జట్టులో బుమ్రా ఇప్పుడు అసాధరణ బౌలర్‌గా మారిపోయాడు. నేను తొలిసారి చూసి అంచనా వేసిన బూమ్రాకు ఇప్పటి బూమ్రాకు చాలా తేడా ఉంది. నేను మొదట అతని బౌలింగ్‌ శైలిని చూసి అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ రోజులు ఉండడని అంచనా వేశా. బుమ్రా నా అంచనాను తారుమారు చేశాడు' అని కపిల్ అన్నాడు.

పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కలిగి ఉండాలి

పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కలిగి ఉండాలి

భారత జట్టులో ఆటగాళ్లంతా పూర్తిస్థాయి ఫిట్‌నెస్ కలిగి ఉండాలన్న కోహ్లీ నిర్ణయాన్ని తప్పకుండా గౌరవించాల్సిన అవసరం ఉందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో భారత జట్టు అత్యుత్తమ ఫిట్ నెస్ స్థాయిని కలిగి ఉందంటే దానికి కోహ్లీనే కారణమంటూ కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు.

జట్టంతా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని కోరుకుంటాడు

జట్టంతా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని కోరుకుంటాడు

'ఏ జట్టు కెప్టెన్ అయినా తన జట్టే మెరుగ్గా రాణించాలనుకుంటాడు. అందుకోసం ఎన్నో ఆలోచనలు చేస్తాడు. జట్టంతా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని కోరుకుంటాడు. అతని నిర్ణయాన్ని అందరూ గౌరవించాలి. ఈ విషయంలో కోహ్లీకే నా పూర్తి మద్దతు ప్రకటిస్తా. నువ్వు ఎంత గొప్ప ఆటగాడివి అయినా మైదానంలో క్యాచ్‌లు పట్టకపోతే ప్రత్యర్థి జట్టుకు ఎక్కువ పరుగులు లభిస్తాయి' అని కపిల్ తెలిపాడు.

ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి

ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి

దీని వల్ల ప్రత్యర్ధి జట్టుకు ఎంతో లాభమని కపిల్ పేర్కొన్నాడు. అందుకే ఆటగాళ్లు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలని, ఇందులో భాగమే యో యో పరీక్ష అని అన్నాడు. దీనిని తప్పుపట్టాల్సిన అవసరం ఎంతమాత్రం లేదని కపిల్‌దేవ్‌ తెలిపాడు. ఇప్పటివరకు 28 వన్డేల్లో 52 వికెట్లు తీశాడు. అలాగే 28 టీ20ల్లో 38 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బుమ్రా

2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బుమ్రా

2016 జనవరిలో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన బుమ్రా న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లోనూ అతను అద్భుతంగా రాణించి జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఆదివారం కాన్పూర్‌ వేదికగా జరిగిన చివరి వన్డేలో కీలక సమయంలో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ టేలర్‌ను బోల్తా కొట్టించి భారత్‌కు విజయాన్ని అందించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:18 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+