Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Jasprit Bumrah Marriage: ఈరోజే పెళ్లి...వధువు ఎవరంటే? అతిథులు 20 మందిమాత్రమే!

Jasprit Bumrah is all set to marry Sanjana Ganeshan today in Goa

గోవా: టీమిండియా స్టార్ పేసర్, స్పీడ్‌స్ట‌ర్ జస్ప్రీత్ బుమ్రా ఈరోజు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. స్పోర్ట్స్ ప్రజెంటర్, మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్ సంజనా గణేశన్‌‌ని గోవాలో బుమ్రా వివాహం చేసుకోబోతున్నాడు. అయితే కొద్దిమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో జరగనున్న ఈ వివాహానికి మొబైల్ ఫోన్స్‌‌ని కూడా తీసుకురావొద్దని అతిథుల్ని బుమ్రా, సంజనా రిక్వెస్ చేశారట. కరోనా నేపథ్యంలో 20 మంది మాత్రమే అతిథులు వస్తున్నారట. ఈ మేరకు ఓ జాతీయ మీడియా తమ కథనంలో రాసుకొచ్చింది. ఆదివారం గోవాలో వివాహానికి ముందు జరిగే కార్యక్రమాలు ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం.

సంజనాతో బుమ్రా పెళ్లి:

సంజనాతో బుమ్రా పెళ్లి:

ఇంగ్లండ్‌తో చివరి టెస్టుతో పాటు.. ప్రస్తుతం జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌ నుంచి జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బుమ్రా ఎందుకు తప్పుకున్నాడో మాత్రం బీసీసీఐ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో మీడియా ఆరా తీయగా.. అతడు వివాహం చేసుకుంటున్నాడని తెలిసింది. అయితే వధువు ఎవరన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తాజాగా స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనాని బుమ్రా వివాహం చేసుకోబుతున్నట్లు వెలుగులోకి వచ్చింది.

క్రీడా ప్రముఖులకి విందు:

క్రీడా ప్రముఖులకి విందు:

వివాహం తర్వాత 27 ఏళ్ల జస్ప్రీత్ బుమ్రా.. భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులకి విందు ఇవ్వనున్నట్లు సమాచారం తెలుస్తోంది. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా:

స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా:

మహారాష్ట్రకు చెందిన 28 ఏళ్ల సంజన ఎంటీవీ స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 7తో కెరీర్‌ ఆరంభించారు. ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అయిన సంజన ఐపీఎల్‌ సహా పలు క్రీడా ఈవెంట్లకు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ 2020 సీజన్‌కి కూడా స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా సంజనా పనిచేశారు. సంజనా‌కు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. 2012లో ఫెమీనా స్టైలిష్ దివాలో ఫైనలిస్టుగా నిలిచారు. 2013లో ఫెమీనా గాడ్జియస్‌గా నిలిచారు. అలాగే 2013లో ఫెమీనా మిస్ ఇండియా పూణే కిరీటం సొంతం చేసుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 1.43 లక్షల ఫాలోయర్స్ ఉన్నారు. ఇప్పుడు బుమ్రాను పెళ్లి చేసుకుంటుందనే వార్తలతో సంజన మరింత ఫేమస్ అయ్యారు.

బిజీ షెడ్యూల్ మధ్య:

బిజీ షెడ్యూల్ మధ్య:

ఇంగ్లండ్‌తో ఇంకా టీ20, వన్డే సిరీస్ ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2021 ఉంది. ఏప్రిల్ 11 నుంచి జూన్ 6 వరకూ ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరిగే అవకాశాలు ఉన్నాయి. ముంబై ఇండియన్స్ జట్టుకు జస్ప్రీత్ బుమ్రా కీలక బౌలర్. ఆ వెంటనే జూన్‌లోనే ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ జరగనుంది. ఇక అక్టోబరు-నవంబరులో టీ20 ప్రపంచకప్‌ ఉంది. ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఖాళీ సమయమే లేదు. అందుకే పెళ్లికి ఇదే తగిన సమయం అని బుమ్రా భావించినట్లు సమాచారం.

Story first published: Monday, March 15, 2021, 10:39 [IST]
Other articles published on Mar 15, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+