Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టెన్షన్.. టెన్షన్.. ఆ 24 గంటలు బుమ్రాకు కీలకం!

త్వరలోనే ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో జస్‌ప్రీత్‌ బుమ్రా ఆడుతాడా లేదా? ప్రస్తుతం అతడి ఫిట్ నెస్ పరిస్థితి ఎలా ఉంది? అనే ప్రశ్న క్రికెట్ ప్రియులను గత కొద్ది రోజులుగా వెంటాడుతోనే ఉంది. అయితే తాజాగా ఆ ప్రశ్నలకు సమాధానం మరి కొన్ని గంటల్లో తెలియనుంది. బీసీసీఐ మెడికల్ టీమ్ సమక్షంలో ఈ టెస్టులను నిర్వహించారని తెలిసింది.

రీసెంట్ గా జనవరిలో బుమ్రాకు ఒకసారి స్కానింగ్‌ తీశారట. మళ్లీ ఇప్పుడు స్కానింగ్‌ చేసినట్లు సమాచారం అందింది. ఈ రెండు స్కానింగ్ లను న్యూజిలాండ్‌కు చెందిన డాక్టర్ రోవన్‌ స్కౌటెన్ పరిశీలించి, ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని క్రికెట్ వర్గాలు తెలిపాయి. మరో 24 గంటల్లోగా రిపోర్ట్స్ లో ఉన్న విషయాన్ని బయట పెడతారట. ఈ రిపోర్ట్స్ రిజల్ట్ ఆధారంగా బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడతాడా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. బుమ్రా ఫిట్ నెస్ సాధిస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డేలోనూ ఆడించొచ్చు.

Jasprit Bumrah Injury Update Scans Complete reports will be in Next 24 Hours for champions trophy

ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్‌ ట్రోఫీ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలో ఇప్పుటికే జట్టును కూడా ప్రకటించారు. ఇందులో బుమ్రాకు కూడా చోటిచ్చారు. అయితే స్క్వాడ్‌లో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం వస్తే.. ఫిబ్రవరి 12లోగా చెప్పాలి. అదే తుది గడువు. కాబట్టి బుమ్రా ఫిట్‌నెస్‌ సాధిస్తే ఓకే. లేదంటే.. జట్టులోకి మరొకరిని తీసుకునే ఛాన్స్ ఉంది. వాస్తవానికి హర్షిత్ రాణాను ట్రావెల్ రిజర్వ్‌గా తీసుకున్నారు. కాకపోతే అతడిని రిజర్వ్ గానే ఉంచి.. వరుణ్‌ చక్రవర్తిని తీసుకోనే అవకాశం ఉండొచ్చని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.

Story first published: Friday, February 7, 2025, 17:42 [IST]
Other articles published on Feb 7, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+