Ravi Shastri: పదో నంబర్ బ్యాటర్ పదో వికెట్‌కు ఓవర్లో 35పరుగులు కొట్టడమేంటో.. అస్సలు నమ్మలేకపోతున్నా

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న అయిదో టెస్ట్‌లో రెండో రోజు స్టువర్ట్ బ్రాడ్ ఓవర్‌లో బుమ్రా 35పరుగులు పిండుకున్న సంగతి తెలిసిందే. అందులో బుమ్రావి 29పరుగులు కాగా.. మిగితావి ఎక్స్ ట్రాలు. ఇక బుమ్రా బ్యాటింగ్‌కు మాజీ క్రికెటర్ రవిశాస్త్రి అవాక్కయ్యాడు. జస్ప్రీత్ బుమ్రా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టువర్ట్ బ్రాడ్ పూర్తి నిస్సహాయంగా కనిపించాడు. అతనికి ఎలా బౌలింగ్ చేయాలో కూడా అర్థం కాలేదు. తొలి బంతికి ఫోర్ రాగానే కాస్త టెన్షన్‌కు గురై వైడ్ ఫోర్ ఇచ్చాడు. ఆ తర్వాత నోబ్ వేయగా.. బుమ్రా దాన్ని సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఆ ఓవర్ ఒక్క బంతికే స్కోరు 16పరుగులొచ్చాయి.

అప్పట్లో యువీ చేతిలో.. ఇప్పుడు బుమ్రా చేతిలో
ఇక ఆ తర్వాత కూడా బుమ్రా విధ్వంసం కొనసాగింది. వరుసగా రెండు ఫోర్లు, సిక్సర్ బాది, సింగిల్ తీసి 35పరుగులు పిండుకున్నాడు. ఇకపోతే 36 ఏళ్ల బ్రాడ్ ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇక ఇంగ్లాండ్ తరఫున టీ20ల్లో, టెస్టులలో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా కూడా స్టువర్ట్ చెత్త రికార్డు నెలకొల్పాడు. అప్పట్లో టీ20ల్లో యువరాజ్ బ్యాటింగ్ చేస్తుండగా ఒకే ఓవర్లో 6బంతులకు 6సిక్సర్లు ఇచ్చిన బ్రాడ్.. తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
అంతకుముందు పీటర్సన్ బౌలింగ్లో బ్రియాన్ లారా
ఇకపోతే అంతకుముందు.. జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌లో వెస్టిండీస్‌కు చెందిన బ్రియాన్ లారా బ్యాటింగ్ చేస్తుండగా.. 28పరుగులిచ్చిన దక్షిణాఫ్రికా స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ పేరిట టెస్టులో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రికార్డ్ ఉండేది కాగా ఆ రికార్డు స్టువర్ట్ బ్రాడ్ స్వీకరించాడు. ఇక ఈ రవిశాస్త్రి ఈ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీలో ప్యానెల్లో ఉన్న సంగతి తెలిసిందే. రవిశాస్త్రి బుమ్రా బ్యాటింగ్ విధానం పట్ల చాలా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

ఈరోజు నేను చూసింది అబ్బురం
'బుమ్రా 35పరుగులు చేసినప్పుడు నేను మళ్లీ మైక్ వద్ద ఉన్నాననే విషయం నాకు చెప్పొద్దు. నేను ప్రతి బంతి చూశాను. కానీ ఇంకా నిజమని నమ్మలేకపోతున్నా. యువరాజ్ సింగ్ 6బంతుల్లో 6సిక్సులు కొట్టి 36పరుగులు చేసినప్పుడు కూడా నేను కామెంట్రీలో ఉన్నాను. కానీ అది వేరు. ఈ రోజు నేను చూసినది నిజంగా అబ్బురంగా ఉంది. ఇది మీరు ఊహించలేరు. తొలిసారిగా భారత కెప్టెన్ అయిన బుమ్రా, 10వ వికెట్‌కు, 10వ నంబర్ బ్యాటర్‌గా దిగి ఇన్ని పరుగులు చేయడం నిజంగా మామూలు ఆశ్చర్యం కాదు. ఒక స్పెషలిస్టు బ్యాటర్ వల్ల కాని బుమ్రా ప్రపంచ రికార్డు సృష్టించాడు' అని శాస్త్రి కొనియాడాడు.

ఆటలో ఆశ్చర్యపరిచే విషయాలు ఎప్పుడూ జరుగుతాయి..
'ఇన్నేళ్ల జీవితంలో ఎన్నో సంచలనాలు చూశాం.. ఇంక చూడ్డానికి ఏముందనిపిస్తుంది. కానీ అది తప్పు. ఇప్పటికీ ఆటలో మనం నిత్య విద్యార్థులమే. ఏదో ఒక రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే నాక్స్ వస్తుంటాయి. ఈ రోజు నేను చూసినది పూర్తిగా వింతగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఒకే ఓవర్లు తాను 29పరుగులు బాదడమే కాకుండా.. 35పరుగులు పిండుకుని ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు' అంటూ రవిశాస్త్రి తెగ ఆశ్చర్యపోయాడు.
బుమ్రా 16బంతుల్లో 31పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. బుమ్రా మూడు వికెట్లు తీయడంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 3వికెట్లు కోల్పోయి 60పరుగులు చేసింది. క్రీజులో బెయిర్ స్టో (6), రూట్ (19) ఆడుతున్నారు. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications