ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ యార్కర్ వేయాలంటే బుమ్రానే


హైదరాబాద్: ప్రపంచ క్రికెట్లో అత్యంత అద్భుతమైన యార్కర్లు వేసే నైపుణ్యం టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు మాత్రమే ఉందని పాకిస్థాన్ దిగ్గజ బౌలర్ వసీమ్ అక్రమ్ అన్నాడు. ఆసీస్ గడ్డపై టీమిండియా నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను సొంతం చేసుకోవడంలో జస్ప్రీత్ బుమ్రా కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో వసీమ్ అక్రమ్ మాట్లాడుతూ "ప్రస్తుతం బౌలర్లందరి కంటే అత్యుత్తమంగా యార్కర్లు వేసే సత్తా బుమ్రాకు మాత్రమే ఉంది. మిగతా బౌలర్ల కంటే అతని బౌలింగ్ శైలి విభిన్నంగా ఉన్నప్పటికీ బుమ్రా స్వింగ్ రాబడుతున్నాడు. పేస్‌తో బ్యాట్స్‌మన్లను తిప్పలు పెడుతున్నాడు" అని అన్నాడు.

బుమ్రాని ప్రత్యేకంగా నిలిపేది యార్కరే
"కానీ అతణ్ని ప్రత్యేకంగా నిలిపేది యార్కర్ మాత్రమే. వన్డేల్లోనే కాదు అతను టెస్టుల్లోనూ ఆ తరహా బంతులను విజయవంతంగా వేస్తున్నాడు. అప్పట్లో నేను, వకార్ యూనిస్ అలా చేసేవాళ్లం" అని అక్రమ్ అన్నాడు. పాక్ నుంచి తనలాంటి బౌలర్ వచ్చినా, భారత్ నుంచి బుమ్రా లాంటి పేసర్ వచ్చినా కూడా దానికి కారణం టెన్నిస్ బాల్ క్రికెట్ అని చెప్పాడు.

అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా
ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో జస్ప్రీత్ బుమ్రా అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ టెస్టు సిరిస్‌లో జస్ప్రీత్ బుమ్రా 21 వికెట్లు తీయడం విశేషం. ఓ టెస్టు సిరిస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత ఆటగాళ్ల జాబితాలో బుమ్రా (21 వికెట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్
1991/92 ఆసీస్ పర్యటనలో మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్(25) వికెట్లు తీశాడు. అయితే అది ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కావడం విశేషం. కాగా, ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరిస్‌తో పాటు న్యూజిలాండ్ పర్యటనకు సైతం టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. బుమ్రా స్థానంలో మహమ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications