Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బుడ్డోడిని చూసి బుమ్రా భయపడ్డాడు: స్టార్ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

ఐపీఎల్ 2026లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ సృష్టిస్తున్న ప్రకంపనలు అంతర్జాతీయ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరుస్తున్నాయి. గౌహతి వేదికగా ముంబై ఇండియన్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ అత్యుత్తమ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలిచి వైభవ్ సూర్యవంశీ అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ అద్భుత ప్రదర్శనపై దక్షిణాఫ్రికా స్పీడ్ దిగ్గడం డేల్ స్టెయిన్ స్పందిస్తూ.. వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ చూస్తుంటే సాక్షాత్తు బుమ్రానే భయపడినట్లు అనిపించిందని కామెంట్ చేశాడు.

బుమ్రా నవ్వు వెనుక అసలు రహస్యం ఇదే!
ఈ మ్యాచ్‌పై విశ్లేషిస్తూ డేల్ స్టెయిన్ ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. డేల్ స్టెయిన్ మాట్లాడుతూ.. "వైభవ్ సూర్యవంశీ బౌలర్ల మనసులో ఓ రకమైన భయాన్ని నింపాడు. బుమ్రా వంటి దిగ్గజం కూడా వైభవ్‌కు బంతి వేసేటప్పుడు.. 'తప్పుగా వేస్తే ఈ కుర్రాడు సిక్స్ కొడతాడు' అని ఆలోచించి ఉంటాడు. అందుకే బుమ్రా తన బంతిని సరిగ్గా వేయలేక స్లాట్‌లో వేశాడు. తొలి బంతికే సిక్స్ పడగానే బుమ్రా నవ్వడం మనం చూశాం.. అది చూస్తుంటే 'నేను తప్పుగా వేస్తానని నాకు తెలుసు, అందుకే అది సిక్స్ వెళ్ళింది' అని జస్ప్రీత్ బుమ్రా అనుకుంటున్నట్టుగా ఉంది" అని డేల్ స్టెయిన్ చెప్పుకొచ్చాడు.

Jasprit Bumrah Fears the Kid Dale Steyn Shocking Remarks on Vaibhav Suryavanshi Batting Heroics

ఈ కుర్రాడికి అసలు భయం లేదు..
వైభవ్ బ్యాటింగ్ స్టైల్ గురించి డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించాడు. "ఈ వండర్ కిడ్‌కు అసలు భయమంటే ఏమిటో తెలీదు. ఏ బంతి వేసినా స్టేడియం బయట పడేస్తున్నాడు. అది బుమ్రా అయినా లేక సాధారణ బౌలర్ అయినా సరే.. వైభవ్ మాత్రం కనికరం చూపడం లేదు. బౌలర్లు అతడిని అవుట్ చేయాలంటే లెంగ్త్‌ను వెనక్కి తగ్గించి గుడ్ లెంగ్త్‌లో బంతులు వేయాలి. అలా కాకుండా ఫుల్ లెంగ్త్ బంతులు వేస్తే మాత్రం శిక్ష తప్పదు" అని డేల్ స్టెయిన్ బౌలర్లకు సూచించాడు.

వరుసగా మూడు మ్యాచ్‌ల్లో విఫలమైన బుమ్రా!
వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ జోడి ముంబై బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టి కేవలం 11 ఓవర్లలోనే 150 పరుగుల భారీ స్కోరు సాధించారు. వైభవ్ కేవలం 14 బంతుల్లో 278 స్ట్రైక్ రేట్‌తో 39 పరుగులు చేయగా.. అందులో 5 భారీ సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ముంబై స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు ఇది వరుసగా మూడో వికెట్ లేని మ్యాచ్ కావడం గమనార్హం. వైభవ్ ధాటికి ముంబై బౌలింగ్ విభాగం పూర్తిగా కుప్పకూలడంతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం సాధించింది.

ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమోగిపోతోంది. 15 ఏళ్ల వయసులో ఈ స్థాయి పరిణితి చూపడం భవిష్యత్తులో అతను ఓ సూపర్ స్టార్ అవుతాడనడానికి సంకేతమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Story first published: Wednesday, April 8, 2026, 17:36 [IST]
Other articles published on Apr 8, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+