
హైదరాబాద్: శ్రీలంకతో వన్డే సిరీస్‌తో పాటు మూడు టీ20ల సిరిస్‌కు రోహిత్ శర్మకే కెప్టెన్సీ పగ్గాలను అప్పజెప్పారు సెలక్టర్లు. ఢిల్లీ టెస్టు అనంతరం డిసెంబరు 10 నుంచి భారత్-శ్రీలంక మధ్య ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌కు ఇప్పటికే విశ్రాంతి కల్పించి కెప్టెన్సీ బాధ్యతలను కోహ్లీకి అప్పగించిన సంగతి తెలిసిందే.

తాజాగా టీ20 నుంచి కూడా కోహ్లీకి విశ్రాంతి కల్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 20 నుంచి భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. మరోవైపు టీ20లకు హైదరాబాద్ ఆటగాడు మహ్మద్ సిరాజ్ చోటు దక్కించుకున్నాడు.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు సిరాజ్ తొలిసారి టీమిండియాలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. సిరాజ్‌తో పాటు టీ20 సిరిస్‌కు కేరళకు చెందిన తంపి, హర్యానాకు చెందిన దీపక్ హుడాలు తొలిసారి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు.
మరోవైపు లంతో సిరిస్ ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికాతో మూడు టెస్టులు ఆడనుంది. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే భారత జట్టును కూడా బీసీసీఐ సెలక్టర్లు సోమవారం ప్రకటించారు. ఈ రెండు జట్లను గత సోమవారమే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ ఈరోజు ప్రకటించారు.
శ్రీలంకతో జరిగే టీ20 సిరీస్ జట్టు:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, మహేంద్ర సింగ్ ధోనీ(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, వాసింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, దీపక్ హూడా, బూమ్రా, మహమ్మద్ సిరాజ్, బాసిల్ తంపి, జయదేవ్ ఉనద్కత్.
దక్షిణాఫ్రికా పర్యటనకు టెస్టు జట్టు:
విరాట్ కోహ్లీ(కెప్టెన్), మురళీ విజయ్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పుజారా, రహానె(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, సాహా(వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, జడేజా, పార్దీవ్, హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమి, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, బుమ్రా.