న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

చిన్నప్పటి నుంచీ నాకు బౌలింగ్‌ చేయడమే ఇష్టం: జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah ,Who Says Many Things About Tennis Ball Cricket | Oneindia Telugu
Jasprit Bumrah doesnt believe in sledging, likes to channelise aggression in his bowling

హైదరాబాద్: గాలిలోనే వేగంగా బౌలింగ్‌ చేయడం అలవాటు చేసుకున్నానని టీమిండియా డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. చిన్నప్పుడు బుమ్రా టెన్నిస్‌ బంతి క్రికెట్‌ ఆడేవాడట. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో "చిన్నప్పటి నుంచీ నాకు బౌలింగ్‌ చేయడమే ఇష్టం. టెన్నిస్‌ బంతి క్రికెట్‌ విపరీతంగా ఆడేవాడిని" అని బుమ్రా అన్నాడు.

మోడ్రన్ ఎరాలో బెస్ట్ ఫీల్డర్ అతడే!: జాంటీ రోడ్స్ కితాబుమోడ్రన్ ఎరాలో బెస్ట్ ఫీల్డర్ అతడే!: జాంటీ రోడ్స్ కితాబు

నేను బౌలింగ్‌ చేసే వాడిని

నేను బౌలింగ్‌ చేసే వాడిని

"అందరూ బ్యాటింగ్‌ వైపు మొగ్గు చూపితే.. నేను బౌలింగ్‌ చేసే వాడిని. అప్పుడే నేను ఎంత వేగంగా బంతులు వేస్తానో గ్రహించా. టెన్నిస్‌ బంతితో బౌలింగ్‌ చేసేటపుడు బంతి నేలను తాకితే వేగం తగ్గిపోతుంది. కాబట్టి గాలిలోనే వేగంగా బౌలింగ్‌ చేయడం అలవాటు చేసుకున్నా. నా యార్కర్లు కూడా టెన్నిస్‌ బంతితో నేర్చుకున్నవే" అని బుమ్రా పేర్కొన్నాడు.

టెన్నిస్‌ బంతి వల్ల క్రికెట్‌కు ఎంతో ఉపయోగం

టెన్నిస్‌ బంతి వల్ల క్రికెట్‌కు ఎంతో ఉపయోగం

"అప్పట్లో సరదా కోసం ఆడేవాడిని. కానీ తర్వాత తెలిసింది టెన్నిస్‌ బంతి వల్ల క్రికెట్‌కు ఎంతో ఉపయోగమని. నా బౌలింగ్‌ మీద చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు వ్యక్తం చేసారు. శైలిని మార్చుకోమని చాలామంది సలహాలిచ్చారు. అయితే, వాటిని వినలేదు. నా దారిని నేను సొంతంగా వెతుక్కోవడానికి ఇష్టపడతా" అని బుమ్రా చెప్పుకొచ్చాడు.

ఈ మనస్తత్వం నా క్రికెట్ ఎదుగుదలలో

ఈ మనస్తత్వం నా క్రికెట్ ఎదుగుదలలో

"చిన్నప్పటి నుంచీ ఇతరులపై ఆధారపడటం తక్కువే. పరిస్థితులు అనుకూలంగా లేనపుడు కూడా ఇదే పద్ధతి పాటిస్తాను. ఈ మనస్తత్వం నా క్రికెట్ ఎదుగుదలలో ఎంతగానో ఉపయోగపడింది" అని బుమ్ర చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, February 14, 2019, 10:38 [IST]
Other articles published on Feb 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X