
హైదరాబాద్: క్రికెటర్లకు హీరోయిన్లు అభిమానులు అయిపోవడం కొత్తేం కాదు. ఇప్పుడు ఇదే పంథాలోకి సౌత్ ఇండియన్ హీరోయిన్ కూడా వచ్చి చేరింది. ఆమె ఎవరంటే తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తోన్న రాశీఖన్నా. ఈ మధ్యనే ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ బుమ్రాను తెగ పొగిడేసింది.
అంతేకాదు, అతని కోసమే క్రికెట్ చూస్తాను అన్నంత స్థాయిలో చెప్పింది. రాశీఖన్నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టమట. బుమ్రా అంటే పిచ్చి అభిమానం కూడా ఉందట. 'భారత క్రికెట్ జట్టు ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా చూస్తాను. ఏ ఒక్క మ్యాచ్ కూడా మిస్సవ్వను. ఎందుకో తెలుసా.. నాకు బుమ్రా అంటే చాలా ఇష్టం. నేను అతనికి చాలా పెద్ద ఫ్యాన్‌ని. అతని కోసమే మ్యాచ్‌లు చూస్తాను.' అని చెప్పుకొచ్చింది రాశీ..
తెల్లవారుజాము షూటింగ్ ఉన్నా సరే.. ఒక్కోసారి రాత్రి వేళల్లో మ్యాచ్‌లు కూేడా వదలిపెట్టను' అని నవ్వుతూ చెప్పింది రాశీఖన్నా. గతంలో బుమ్రా బౌలింగ్‌పై రాశీఖన్నా సామాజిక మాధ్యమాల్లో పలుమార్లు ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే.
బుధవారం జరిగిన మూడో వన్డేలో బుమ్రా 32/2 స్కోరుతో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో భారత్ 124పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.