For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'యోయో పద్ధతి సరైంది కాదు'

Jasprit Bumrah can be the Virat Kohli of bowling, says former Indian cricketer Mohammad Kaif

హైదరాబాద్: భారత్ జట్టులోకి ఎంపికవ్వాలంటే ఆటగాడు యో-యో ఫిట్‌నెస్ టెస్టులో పాసవ్వాలనే నిబంధనని టీమిండియా తప్పనిసరిగా అమలు చేస్తుండటంపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ మండిపడ్డాడు. క్రికెటర్ ఫామ్‌ని ఆధారంగా చేసుకుని జట్టులోకి ఎంపిక చేయాలే తప్ప.. ఇలా కేవలం ఫిట్‌నెస్‌ని ప్రామాణికంగా తీసుకోవడం మంచిదికాదని హితవు పలికాడు.

పరుగులు సాధిస్తున్నా.. వికెట్లు తీస్తున్నా..

పరుగులు సాధిస్తున్నా.. వికెట్లు తీస్తున్నా..

ఒక క్రికెటర్‌ క్రమంగా పరుగులు సాధిస్తున్నా.. వికెట్లు తీస్తున్నా.. అతడు యోయో టెస్టులో అర్హత సాధించలేదని.. కారణంగా చూపుతూ ఎంపిక చేయకపోవడం కరెక్టు కాదు. క్రికెటర్‌కి ఫిట్‌నెస్ ముఖ్యమే. వాస్తవానికి ఈ యో-యో టెస్టు కారణంగా.. భారత్ జట్టు ఫీల్డింగ్ సామర్థ్యం కూడా గణనీయంగా మెరుగైంది. కానీ.. జట్టు ఎంపికకి కేవలం యో-యో టెస్టుని మాత్రమే ప్రామాణికంగా తీసుకోకూడదని నా అభిప్రాయం.

భారత్‌ జట్టులో కీపర్‌ రిషబ్‌ పంత్‌నే

భారత్‌ జట్టులో కీపర్‌ రిషబ్‌ పంత్‌నే

ప్రస్తుత భారత్‌ జట్టులో వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌నే చూడండి. అతను ఒక కీపర్‌. కానీ 50 ఓవర్ల క్రికెట్‌లో కీపర్‌ కాకుండా ఫీల్డర్‌గా బాధ్యతలు పంచుకున్నాడు. అది అతనికి సౌకర్యవంతం కాకపోవచ్చు. ఇక విరాట్‌ కోహ్లి అద్భుతమైన ఫిట్‌నెస్‌ ప్రమాణాలు ఉన్న ఆటగాడు. జట్టులోని ఆటగాళ్లు కూడా కోహ్లిని అనుసరిస్తూ ఫిట్‌నెస్‌ లెవల్స్‌ను పెంచుకుంటున్నారు. ఫిట్‌నెస్‌ అనేది అవసరం. కానీ యోయో టెస్టు పేరుతో ఆటగాడి కనీస ఉత్తీర్ణత మార్కులు 16.1గా ఉండటం కరెక్ట్‌ కాదు

యో- యోలో విఫలమైన యువరాజ్

యో- యోలో విఫలమైన యువరాజ్

యో- యో టెస్టులో విఫలమై యువరాజ్ సింగ్, సంజు శాంసన్ భారత్ జట్టుకి చాలా కాలం దూరమవగా.. అంబటి రాయుడు తొలిసారి ఫెయిలై.. మళ్లీ ఎట్టకేలకి పాసయ్యాడు. అయితే.. ఈ టెస్టు‌ కారణంగా ఇంగ్లాండ్ పర్యటనకి పూర్తిగా రాయుడు దూరమవ్వాల్సి వచ్చింది. ఇందుకు రాయుడు ఉదంతాన్ని ఉదాహరణగా పేర్కొన్నాడు. మేము భారత్ జట్టులో ఆడుతున్నప్పుడు కూడా ఓ టెస్టు (బీప్ టెస్ట్) ఉండేది.

 మరికొన్ని నెలల్లో మార్పు

మరికొన్ని నెలల్లో మార్పు

దాని ద్వారా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌ సామర్థ్యం తెలిసేది. కానీ.. ఏ ఆటగాడు కూడా ఈ టెస్టు కారణంగా జట్టులో చోటు కోల్పోలేదు. యోయో టెస్టునే అర్హతగా పాటించరాదని, ఇంకా మెరుగైన విధానాన్ని అమలు చేయాలన్నాడు. ఇప్పుడు భారత్ జట్టు అవలంబిస్తున్న టెస్టు పద్ధతి సరిగాలేదు. మరికొన్ని నెలల్లో మార్పు వస్తుందేమో చూడాలి.

Story first published: Sunday, November 4, 2018, 10:35 [IST]
Other articles published on Nov 4, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+