టీ20ల్లో బుమ్రా సరికొత్త ప్రపంచ రికార్డు.. కులశేఖర రికార్డు బ్రేక్!!

మౌంట్‌మాంగని: ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో ఆదివారం జరిగిన చివరి టీ20లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 163 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (41 బంతుల్లో 60; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (33 బంతుల్లో 45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కుగ్లిన్ 2 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 156 పరుగులు చేసింది. రాస్ టేలర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), టీమ్ సీఫెర్ట్ (30 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీలు చేశారు. శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ చెరో 2 వికెట్లు తీశారు.

బుమ్రా సరికొత్త రికార్డు:
ఐదవ టీ20లో టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసాడు. తన కోట నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీయడంతో పాటు కేవలం 12 పరుగులే ఇచ్చి ఒక మెయిడిన్ ఓవర్ వేసాడు. ఒక మెయిడిన్ ఓవర్ వేయడంతో టీ20ల్లో బుమ్రా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. బుమ్రా తన టీ20 కెరీర్‌లో ఏడో మెయిడిన్ నమోదు చేశాడు.

కులశేఖర రికార్డు బ్రేక్:
ఏడు మెయిడిన్ ఓవర్లతో శ్రీలంక మాజీ పేస్ బౌలర్ నువాన్ కులశేఖర రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు. 58 టీ20 మ్యాచ్‌లలో కులశేఖర ఆరు మెయిడిన్ ఓవర్లు వేసాడు. తాజాగా ఆ రికార్డును బుమ్రా బద్ధలు కొట్టాడు. కివీస్‌తో ఆఖరి టీ20 మ్యాచ్ బుమ్రాకు 50వ టీ20. కులశేఖర 66 టీ20 వికెట్లు తీయగా.. బుమ్రా 59 వికెట్లు సాధించాడు. వికెట్ల పరంగా బుమ్రా కంటే కులశేఖరనే ముందంజలో ఉన్నాడు. లంక పేసర్ లసిత్ మలింగ ఇప్పకే 106 వికెట్లు తీసిన విషయం తెలిసిందే.

6 బంతుల్లో 34 రన్స్:
ఒకవైపు బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పితే.. యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఓ చెత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఆఖరి టీ20 పదో ఓవర్‌లో ఏకంగా 34 పరుగులు ఇచ్చాడు. దీంతో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (36) తర్వాత స్థానంలో దూబే నిలిచాడు. వేన్ పర్నెల్, ఇజతుల్లా దౌలత్‌జాయ్, స్టువర్ట్ బిన్నీ, మాక్స్ ఓడౌడ్ 32 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నారు.

సిరీస్ క్లీన్‌స్వీప్:
చివరి టీ20లో భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది.దాంతో న్యూజిలాండ్‌పై ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన తొలి జట్టుగా రికార్డుల్లోకెక్కింది. అదే సమయంలో టీ20 చరిత్రలో ఐదు మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో ఓటమి లేకుండా ఒక జట్టు విజయం సాధించడం ఇదే తొలిసారి. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం కివీస్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications