న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫాస్టెస్ట్ డెలివరీ: స్టార్క్ రికార్డుని బద్దలు కొట్టిన బుమ్రా(వీడియో)

India vs Australia 1st Test Day 2: Jasprit Bumrah Beats Mitchell Starc To Bowl The Fastest Delivery
Jasprit Bumrah beats Mitchell Starc to bowl the fastest delivery in the Test match

హైదరాబాద్: జస్ప్రీత్ బుమ్రా... మూడు ఫార్మాట్లలోనే నిలకడగా రాణిస్తోన్న టీమిండియా పేసర్. అహ్మదాబాద్‌కు చెందిన ఈ పేసర్ 2016లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినా... ఈ ఏడాది జనవరిలో సఫారీ గడ్డపై టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఈ సిరిస్‌లో బుమ్రా గాయపడినా... త్వరగానే కొలుకుని తిరిగి టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు.

<strong>టెస్టుల్లో అత్యధిక యావరేజి: ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరో తెలుసా?</strong>టెస్టుల్లో అత్యధిక యావరేజి: ఆ ఐదుగురు క్రికెటర్లు ఎవరో తెలుసా?

25 ఏళ్ల బుమ్రా ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఆడుతున్నాడు. ఈ సిరిస్‌లో భాగంగా గురువారం ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత బ్యాట్స్‌‌మెన్లలో పుజారా(123) సెంచరీతో రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులకే ఆలౌటైంది.

ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో

ఓవర్‌నైట్ స్కోరు 250/9 పరుగులతో రెండోరోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియా పరుగులేమీ చేయకుండానే షమీ(6) రూపంలో చివరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ట్రావిస్ హెడ్(61), మిచెల్ స్టార్క్ (8) పరుగులతో క్రీజులో ఉన్నారు.

తొలి ఇన్నింగ్స్‌లో 59 పరుగులు వెనుకబడి

తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా ఆస్ట్రేలియా 59 పరుగులు వెనుకబడి ఉంది. భారత బౌలర్లలో అశ్విన్‌ మూడు వికెట్లు సాధించగా, బూమ్రా, ఇషాంత్‌లు తలో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో పేసర్ బుమ్రా 20 ఓవర్లు వేసి 34 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఇందులో తొమ్మిది ఓవర్లు మెడిన్ ఓవర్లు కావడం విశేషం.

శుక్రవారం రెండు వికెట్లు తీసిన బుమ్రా

అయితే, బుమ్రా తీసిన రెండు వికెట్లు కూడా కీలక వికెట్లు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో బుమ్రా పీటర్ హ్యాండ్స్‌కోంబ్, పాట్ కమ్మిన్స్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో బుమ్రా ఫాస్టెస్ట్ డెలివరీని సంధించడం విశేషం. తొలి స్పెల్‌లో బుమ్రా వేసిన ఓ బంతి 153 km/h వేగాన్ని నమోదు చేసింది. ఈ క్రమంలో ఆసీస్ పేసర్లు మిచెల్ స్టార్క్, కమ్మిన్స్ వేగాన్ని బుమ్రా అధిగమించాడు.

మిచెల్ స్టార్క్ వేగాన్ని అధిగమించిన బుమ్రా

ఆస్ట్రేలియా పిచ్‌లు పేస్‌ బౌన్స్‌కు పెట్టింది పేరు. ఆసీస్ బౌలర్లు సైతం ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లను తమ బౌన్సర్లతో భయభ్రాంతులకు గురి చేసే సంగతి తెలిసిందే. ఈ టెస్టులో భారత తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన ఓ బంతి 149 km/h వేగాన్ని నమోదు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోని క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.

1
43623
Story first published: Friday, December 7, 2018, 17:40 [IST]
Other articles published on Dec 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X