Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND VS PAK Bumrah: బుమ్రా సడెన్ ఎంట్రీ.. వచ్చీ రాగానే నాలుగు ఐసీసీ అవార్డులు

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతోన్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు టీమిండియా స్టార్ పేసర్ బుమ్రా. ఈ మ్యాచ్ కే స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. అదేంటి అతడు ఫిట్నెస్ సాధించలేదని ట్రోఫీకి దూరంగా ఉన్నాడు కదా అని అనుకుంటున్నారా?.. అయితే అతడు బరిలోకి దిగింది ఆటగాడిగా కాదండోయ్.. స్పెషల్ గెస్ట్ గా. దుబాయ్ స్టేడియం వేదికగా జరుగుతోన్న దాయాదుల పోరుకు ప్రత్యేక అతిథిగా హాజరైన అతడు తన జట్టు ఆటగాళ్లకు కలిసి ఆల్ ది బెస్ట్ విషెస్ తెలిపాడు. స్టాండ్స్ లో కూర్చొని టీమ్ మేట్స్ ను ఎంకరేజ్ చేస్తున్నాడు.

India vs Pakistan Live స్కోరు కార్డు

ఐసీసీ అవార్డులు...
భారత్ - పాక్ మ్యాచ్ కు హారజైన జస్ప్రిత్ బుమ్రా తాను గెలుచుకున్న ఐసీసీ అవార్డులను మైదానంలో ఐసీసీ ఛైర్మన్ జైషా చేతుల మీదుగా అందుకున్నాడు. మెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాలను దక్కించుకున్నాడు. అలానే మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయర్, మెన్స్ టీ20 ఆఫ్ ది ఇయర్ క్యాప్ లను అందుకున్నాడు. 2024లో అద్భుత ప్రదర్శన చేసినందుకు ఐసీసీ ఈ అవార్డులను బుమ్రాకు అందజేసింది.

Jasprit Bumrah attends India vs Pakistan match receives ICC awards in champions trophy 2025

హీరోలా హుందాగా బుమ్రా..
తాజాగా పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో జస్ప్రిత్ బుమ్రా వైట్ షర్ట్ లో ఎంతో హుందాగా కనిపించాడు. మైదానంలో దిగి అతడు తన సహ క్రికెటర్లతో సరదాగా ముచ్చటిస్తూ స్టైలిష్ గా ఆకట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తమ అభిమాన క్రికెట్ మ్యాచ్ కు రావడం చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Story first published: Sunday, February 23, 2025, 15:18 [IST]
Other articles published on Feb 23, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+