బుమ్రా ప్రత్యేక ప్రతిభావంతుడు.. సంక్లిష్టమైన బౌలింగ్ శైలే అతడికి వరం

ముంబై: టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ప్రత్యేక ప్రతిభావంతుడు. సంక్లిష్టమైన బౌలింగ్ శైలే అతడికి వరంగా మారింది అని టీమిండియా మాజీ పేసర్, 2011 ప్రపంచకప్ విజేత భారత జట్టులోని సభ్యుడు జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. బుమ్రా తన ఇబ్బందికరమైన చర్యను బలహీనత కాకుండా ప్రయోజనంగా ఉపయోగించుకున్నాడు అని స్పీడ్‌స్టర్ అభిప్రాయపడ్డాడు. కొద్ది కాలంలోనే అద్భుత బౌలర్‌గా అవతరించిన బుమ్రాపై జహీర్ ప్రశంసలు కురిపించాడు.

సంక్లిష్టమైన బౌలింగ్ శైలే వరం:
తాజాగా జహీర్ ఖాన్ మాట్లాడుతూ... 'బుమ్రా ప్రత్యేక ప్రతిభావంతుడు. తన సంక్లిష్టమైన బౌలింగ్ శైలే అతడికి వరంగా మారింది. బుమ్రా తన ఇబ్బందికర శైలినే అనుకూలంగా మార్చుకొని బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టిస్తున్నాడు. నేర్చుకొనేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాడు. ఫిట్‌నెస్‌పై పూర్తిగా దృష్టి పెట్టాడు. బౌలింగ్‌కు కొత్త విషయాలను జోడించాడు. కొద్ది కాలంలోనే అద్భుత బౌలర్‌గా అవతరించాడు. విజయం సాధించేందుకు అవసరమైన వనరులు అతడిలో ఉన్నాయి' అని జహీర్ అన్నాడు.

ఎలాంటి ప్రయోగాలు చేస్తారో చూడాలి:
'జట్టు విధానాల్లో పారదర్శకత చాలా అవసరం. అన్ని సమస్యలు ఎలా పరిష్కారించబడుతాయో చూడాలి. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ఇంకా సమయం ఉంది. జట్టుపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు. యాజమాన్యం ఇంకా ఎలాంటి ప్రయోగాలు చేస్తారో వేచి చూడాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఆలోచనలకు పదును పెడుతున్నారు. ప్రతి జట్లూ ఇదే చేస్తున్నాయి. ప్రపంచకప్ ముందు ఇంగ్లాండ్ ఎంతో పారదర్శకంగా ఉంది. భారత జట్టు కూడా' అని జహీర్ పేర్కొన్నాడు.

ఉపఖండం పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి:
'దక్షిణాఫ్రికా ప్రస్తుతం యువకులతో నిండి ఉంది. రబాడ సహా మంచి బౌలర్లు ఆ జట్టులో ఉన్నారు. అయితే ఉపఖండం పరిస్థితులకు వారు త్వరగా అలవాటు పడాలి. ఏ పేసరైనా రాణించాలంటే ఇదే ముఖ్యం. ఫాస్ట్ బౌలర్‌కు పాత బంతిని సమర్థంగా విసిరే, రివర్స్ స్వింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. టీ20లో రబాడ రాణించాడు. మరి టెస్టుల్లో ఎలా ఆడతాడో చూడాలి' అని జహీర్ చెప్పుకొచ్చాడు.

విశాఖలో మొదటి టెస్ట్:
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన చివరిదైన మూడో టీ-20లో భారత్ ఓటమిని చవిచూసింది. భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యంను దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో మ్యాచ్ టీమిండియా, మూడో మ్యాచ్ దక్షిణాఫ్రికా గెలిచాయి. వచ్చేనెల 2 నుండి విశాఖ వేదికగా మొదటి టెస్ట్ జరగనుంది. టీ20లలో ఆడని బుమ్రా టెస్టులలో ఆడనున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications