For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Visakhapatnam ODI: నెట్స్‌లో పాల్గొన్న బుమ్రా, ఫిట్‌నెస్ సాధించినట్టేనా?

Jasprit Bumrah appears at India training session ahead of Visakhapatnam ODI

హైదరాబాద్: గాయం నుంచి కోలుకున్న టీమిండియా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు సన్నద్ధమయ్యాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా వెస్టిండిస్‌తో బుధవారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో మంగళావారం నెట్స్‌లో పాల్గొన్న బుమ్రా కట్టుదిట్టంగా బంతులు విసిరాడు.

ఈ ఏడాది జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్‌తో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌ తర్వాత వెన్ను గాయం కారణంగా భారత క్రికెట్‌ జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న బుమ్రా వచ్చే ఏడాది న్యూజిలాండ్‌‌తో జరగనున్న సిరీస్‌కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు యువ ఆటగాడు పృథ్వీషా సైతం ఫిట్‌నెస్‌ సాధించాల్సి ఉంది. టీమిండియా కొత్త నిబంధన ప్రకారం పునరాగమనం చేసే ఆటగాళ్ల ఫిట్‌నెస్‌‌ను జట్టు మేనేజ్‌మెంట్ ముందుగా నెట్స్‌లో పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా బెంగళూరులోని ఆటగాళ్ల పునరావాస శిబిరంలో శిక్షణ తీసుకున్న బుమ్రాను ప్రాక్టీస్‌ సెషన్‌లో బౌలింగ్‌ చేయడానికి విశాఖకు రమ్మంటూ టీమిండియా మేనేజ్‌మెంట్‌ ఆదేశించింది.

దీంతో జట్టుతో కలిసిన బుమ్రాను రిషభ్ పంత్‌, మనీశ్‌ పాండే, మయాంక్‌ అగర్వాల్‌కు బంతులు విసిరాడు. ఈ క్రమంలో బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను హెడ్ కోచ్‌ రవిశాస్త్రి, సెలక్టర్‌ దేవాంగ్‌ గాంధీ దగ్గరుండి పరిశీలించారు. బౌలింగ్ చేసే క్రమంలో బుమ్రా ఎలాంటి సౌకర్యానికి గురికాలేదు. దీంతో ఈ ఫిట్‌నెస్ పరీక్షలో బుమ్రా పాస్ అయినట్లే కనిపిస్తోంది.

కాగా, బుమ్రా ప్రాక్టీస్ సెషన్‌లో బుమ్రా బౌలింగ్‌ చేయడానికి సిద్ధమైన ఫొటోను బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంటూ "ఇక్కడ ఎవరో చూడండి" అంటూ కామెంట్ పెట్టింది.

Story first published: Tuesday, December 17, 2019, 17:45 [IST]
Other articles published on Dec 17, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+