For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సోషల్ మీడియాలో వైరల్ అయిన జస్ప్రీత్ బుమ్రా వెడ్డింగ్ వీడియో!!

Jasprit Bumrah and Sanjana Ganesan Marriage Video goes viral

గోవా: టీమిండియా స్టార్ పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మాజీ మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌ సంజనా గణేశన్‌ను గోవాలో సన్నిహితుల సమక్షంలో సోమవారం వివాహమాడాడు. ట్విట్టర్ వేదికగా బుమ్రా తన పెళ్లి ఫొటోలను సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. తాజాగా బుమ్రా-సంజనా వెడ్డింగ్ వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. వీడియోలో ఇద్దరు పెళ్లి దండలు మార్చుకున్నారు. కాగా పూలతో అలంకరించిన స్టేజ్ సెటప్ అదిరిపోయింది. ఈ వీడియోను ఇప్పటికే 265568 మంది వీక్షించారు.

పెళ్లికి ముందు నిర్వహించిన సంగీత్‌ కార్యక్రమంలో తన ప్రియసఖి సంజనా గణేశన్‌తో కలిసి ఆడిపాడాడు పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా. అందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. స్వయంగా బుమ్రానే ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. వెనకాల మ్యూజిక్ వస్తుండగా.. ఇద్దరూకలిసి ఓస్టెప్ వేశారు. బుమ్రా సూట్‌లో మెరిసిపోగా.. సంజనా హాఫ్ సారీలో తళుక్కుమంది. బుమ్రా మైదానంలో పదునైన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌ పంపడం మనం ఇన్నాళ్లూ చూశాం. కానీ అతడికి డ్యాన్స్ చేయడం కూడా వచ్చని ఈ వీడియోతోనే తెలిసింది.

ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు జస్ప్రీత్ బుమ్రా వ్యక్తిగత కారణాలతో భారత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతడు పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేశాయి. ఈ విషయంపై ఎన్ని వార్తలొచ్చినా అతడు మౌనంగానే ఉన్నాడు. తన పనుల్లో తాను నిమగ్నమయ్యాడు. చివరికి సోమవారం సంజనతో ఒక్కటైన ఫొటోలను స్వయంగా సామాజిక మాధ్యమాల్లో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. దీంతో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

అత్యంత సన్నిహితుల మధ్యనే వివాహం చేసుకున్న బుమ్రా.. త్వరలోనే భారత క్రికెటర్లతో పాటు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులందరికి విందు ఇవ్వనున్నట్లు వారి కుటుంబ వర్గాలు తెలిపాయి. భారత్-ఇంగ్లండ్ మధ్య మార్చి 23 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభంకానుండగా.. ఈ సిరీస్‌లోనూ బుమ్రా ఆడటంపై సందేహాలు ఉన్నాయి. ఐపీఎల్ 2021 సీజన్ ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ జరగనున్న విషయం తెలిసిందే. అందులో బుమ్రా ఆడనున్నాడు. గత ఏడాది ముంబై ఇండియన్స్ టైటిల్స్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.

Story first published: Tuesday, March 16, 2021, 14:15 [IST]
Other articles published on Mar 16, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+