న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్‌కప్‌లో ప్రభావితం చూపే టాప్-3 పేసర్లలో బుమ్రా ఒకడు

ICC Cricket World Cup 2019 : Jasprit Bumrah Among Lee’s Top Three Quicks || Oneindia Telugu
Jasprit Bumrah among Brett Lees top three World Cup quicks

హైదరాబాద్: ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్‌లో తాను ఎంపిక చేసుకున్న ముగ్గురు పేస్ బౌలర్లలో టీమిండియా పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా ఒకడని ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ తెలిపాడు. మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్‌కప్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ నేపథ్యంలో బుమ్రా మాట్లాడుతూ "బుమ్రా అద్భుతమైన బౌలర్. అతడి పేర మంచి రికార్డు ఉంది. అద్భుత యార్కర్‌, మంచి పేస్‌ను కలబోసిన బౌలింగ్‌ అతని సొంతం" బ్రెట్ లీ ప్రశంసించాడు. బుమ్రా భారత్ తరుపున 49 వన్డేలాడి85 వికెట్లు తీశాడు. బుమ్రాతో పాటు బ్రెట్ లీ ఎంపిక చేసిన మిగతా ఇద్దరు ఫాస్ట్‌ బౌలర్లలో తన దేశానికి చెందిన మిచెల్‌ స్టార్క్‌, పాట్‌ కమిన్స్‌లు ఉన్నారు.

"స్టార్క్‌ను మనం మరిచి పోకూడదు. స్టార్క్‌ ఎడమచేతివాటం బౌలర్‌. చాతి నొప్పి నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ను తిరిగి పొందాడు. అతడిలో మంచి ప్రతిభ ఉంది. 2015 ప్రపంచకప్‌లో అతను 22 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డును దక్కించుకున్నాడు" అని బ్రెట్ లీ చెప్పాడు.

ఇక, ప్యాట్ కమ్మిన్స్ విషయానికి వస్తే అతడి బౌలింగ్‌లో కచ్చితత్వం ఉంటుందని బ్రెట్ లీ పేర్కొన్నా డు. ఈ ఏడాది ప్యాట్స్ కమిన్స్‌ 6 మ్యాచ్‌లాడి 17 వికెట్లు పడగొట్టాడు. కాగా, బ్రెట్ లీ 2003లో వరల్డ్‌‌కప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.

Story first published: Friday, May 24, 2019, 19:43 [IST]
Other articles published on May 24, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X