ప్రపంచకప్‌లో రాయ్ విధ్వంసం.. తొలిసారి టెస్టు జట్టులో చోటు

ప్రపంచకప్-2019లో విధ్వంసకర ఆటతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ త్వరలో టెస్టుల్లో అరంగేట్రం చేయనున్నాడు. ప్రపంచకప్ టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేయడంతో రాయ్ తొలిసారి ఇంగ్లండ్ టెస్టు జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చే బుధవారం ఐర్లాండ్‌తో జరగబోయే ఏకైక టెస్టు కోసం ప్రకటించిన జాబితాలో రాయ్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీంతో ఐర్లాండ్‌పై ఈ ప్రపంచకప్ హీరో టెస్టు అరంగేట్రం చేసే అవకాశం ఉంది.

తొలిసారి టెస్ట్ జట్టులోకి:
రాయ్‌తో పాటు లూయిస్ గ్రెగొరీ, ఓలీ స్టోన్ కూడా తొలిసారి టెస్ట్ జట్టులోకి ఎంపికయ్యారు. యాషెస్‌కు ముందు ఈ ముగ్గురిని ఇంగ్లండ్ ప్రరీక్షించనుంది. స్వింగ్ కింగ్ జేమ్స్ ఆండర్సన్ జట్టులో చేరాడు. దీంతో ఇంగ్లండ్ బౌలింగ్‌లో కూడా పటిష్టంగా మారింది. ప్రపంచకప్ ఊపును యాషెస్ వరకు కొనసాగించాలని ఇంగ్లండ్ భావిస్తోంది. యాషెస్‌కు ముందు ఈ టెస్టును వార్మప్‌గా ఉపయోగించుకోవాలని ఇంగ్లండ్ ఆరాటపడుతోంది.

బర్న్స్‌తో కలిసి రాయ్ ఓపెనింగ్:
ముఖ్యంగా ప్రపంచకప్‌లో ఆకట్టుకున్న రాయ్ టెస్టు ప్రదర్శనను పరిశీలించాలని ఇంగ్లాండ్ సెలెక్టర్లు అనుకుంటున్నారు. ఈ ఫార్మాట్లో సైతం రాయ్ కుదురుకుంటే ఇంగ్లాండ్ మరింత బలోపేతం అవుతుంది. బర్న్స్‌తో కలిసి రాయ్ ఓపెనింగ్ చేయనున్నాడు. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్న ఈ టెస్టు మ్యాచ్‌కు బెన్ స్టోక్స్, జోస్ బట్లర్‌లకు సెలక్టర్లు విశ్రాంతినివ్వగా.. బౌలర్లు జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్‌లను పరిగణలోకి తీసుకోలేదు.

ఇంగ్లండ్ టెస్టు జట్టు:
జోయ్ రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ అండర్సన్, బెయిర్ స్టో, స్టువర్ట్ బ్రాడ్, బర్న్స్, స్యామ్ కరన్, జోయ్ డెన్లీ, లూయిస్ గ్రెగొరీ, లీచ్, జేసన్ రాయ్, స్టోన్, క్రిస్ వోక్స్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications