Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మూడు మ్యాచ్‌ల్లో 340కి పైగా పరుగులు: పాక్ రికార్డుని సమం చేసిన ఇంగ్లాండ్

Jason Roys sensational century seals England series victory over Pakistan

హైదరాబాద్: వరల్డ్‌కప్ ముంగిట ఇంగ్లాండ్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. శుక్రవారం నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఇంగ్లాండ్‌ 3 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో మ్యాచ్ మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్ 2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టులో బాబర్‌ ఆజం (112 బంతుల్లో 115; 13 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో చెలరేగా.. ఫఖర్‌ జమాన్‌(50 బంతుల్లో 57; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మొహమ్మద్ హఫీజ్ (55 బంతుల్లో 59; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది.

ఇదిలా ఉంటే, వన్డేల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో 340కి పైగా పరుగులు చేసిన జట్టుగా పాకిస్థాన్ అరుదైన ఘనత నమోదు చేసింది. అయితే, ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ ఈ రికార్డును సమం చేయడం విశేషం.

ఛేదనలో చెలరేగిన రాయ్

ఛేదనలో చెలరేగిన రాయ్

అనంతరం లక్ష్యఛేదనలో జేసన్ రాయ్ (89 బంతుల్లో 114; 11 ఫోర్లు, 4 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (64 బంతుల్లో 71 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసి విజయం సాధించంది. ఓపెనర్ జేసన్ రాయ్ తొలి వికెట్‌కు జేమ్స్ విన్స్(43)తో కలిసి 94 పరుగులు జోడించాడు.

రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం

రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం

ఆ తర్వాత జో రూట్‌తో కలిసి రెండో వికెట్‌కు 107 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆ తర్వాత 114 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వన్డేల్లో రాయ్‌కి ఇది ఎనిమిదవ సెంచరీ కావడం విశేషం. రాయ్ ఔటైన తర్వాత ఎనిమిది పరుగుల తేడాతో రూట్(36), బట్లర్( 0), అలీ(0) వికెట్లు కోల్పో యి కష్టాల్లో పడింది.

చివరి వన్డే ఆదివారం

చివరి వన్డే ఆదివారం

ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, టామ్ కర్రాన్(31)తో కలిసి జట్టుకు విజయాన్నందించాడు. ఇరు జట్ల మధ్య తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా... ఆ తర్వాతి 3 వన్డేల్లో గెలుపొందిన ఇంగ్లాండ్‌ 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో నామమాత్రమైన చివరి వన్డే ఆదివారం జరుగనుంది.

రాయ్ మాట్లాడుతూ

రాయ్ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం జేసన్ రాయ్ మాట్లాడుతూ "మ్యాచ్‌కు ముందురోజు నా కుమార్తె ఎవర్లీ అస్వస్థతకు గురైంది. రాత్రి 1.30 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లా. ఉదయం 8.30 గంటల వరకు అక్కడే ఉండి ఇంటికి తిరిగొచ్చా. అనంతరం కొద్దిసేపు పడుకున్నా. వార్మప్‌ చేసి మ్యాచ్‌లో బరిలో దిగా. సెంచరీ సాధిస్తానని అనుకోలేదు" అని అన్నాడు.

Story first published: Sunday, May 19, 2019, 11:09 [IST]
Other articles published on May 19, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+