Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IPL 2022: బ‌తికిపోయిన స‌న్‌రైజ‌ర్స్‌.. గుజ‌రాత్‌కు షాక్.. స్టార్ ఓపెన‌ర్ ఔట్‌! ఇందుకే కావ్య పాప‌ కొన‌లేదు

Jason Roy Out Of IPL 2022: SRH Owner Kaviya Maran Did Right Thing By Not Retaining Him For Hyderabad
IPL 2022: బ‌తికిపోయిన SRH, స్టార్ ఓపెన‌ర్ ఔట్‌ Kaviya Maran పై ప్ర‌శంస‌లు | Oneindia Telugu

మ‌రో నెల రోజుల్లో ఐపీఎల్ 2022 ప్రారంభం కానున్న నేప‌థ్యంలో గుజ‌రాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ త‌గిలింది. మెగా వేలంలో భారీ అంచ‌నాలు పెట్టుకోని కొనుగోలు చేసిన ఇంగ్లండ్‌ స్టార్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌ ఉన్న‌ట్టుండి ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకున్నాడు. మ‌రోవైపు జేస‌న్ రాయ్‌ త‌ప్పుకోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ‌తికిపోయింది. ఎందుకంటే గ‌త సీజ‌న్లో త‌మ జ‌ట్టుకే ఆడిన రాయ్‌ను ఈ సారి స‌న్‌రైజ‌ర్స్ రిటైన్ చేసుకోలేదు. అలాగే మెగా వేలంలోనూ అత‌ని కోసం ప్ర‌యత్నించలేదు.

దీంతో మెగా వేలంలో జేస‌న్ రాయ్‌ను కొనకుండా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మంచి ప‌ని చేసింద‌ని అభిమానులు అంటున్నారు. ఇందుకే మెగా వేలంలో జేస‌న్ రాయ్ కోసం స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ కావ్య మార‌న్ ప్ర‌య‌త్నించ‌లేద‌ని చెప్పుకొస్తున్నారు.

త‌ప్పుకున్న జేస‌న్ రాయ్‌

త‌ప్పుకున్న జేస‌న్ రాయ్‌

ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ త‌ప్పుకున్నాడు. దీంతో మెగా వేలంలో అత‌డిని కొనుగోలు చేసిన గుజ‌రాత్ టైటాన్స్‌కు బిగ్‌షాక్ త‌గిలిన‌ట్టైంది. చాలా కాలంగా క‌రోనా కార‌ణంగా బ‌యోబ‌బుల్‌లో గ‌డుపుతున్నాన‌ని, దీంతో ఒత్తిడి పెరిగింద‌ని, అందుకే ఈ సీజ‌న్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు రాయ్ తెలిపాడు. ప్ర‌స్తుతం త‌న కుటుంబంతో గ‌డ‌పాల‌నుకుంటున్న‌ట్లు 31 ఏళ్ల రాయ్‌ చెప్పాడు. జేస‌న్ రాయ్ భార్య గ‌త జ‌న‌వ‌రిలో రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. కాగా ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 13 మ్యాచ్‌లు ఆడిన జేస‌న్ రాయ్ 29 స‌గ‌టుతో 329 ప‌రుగులు చేశాడు.

బ‌తికిపోయిన స‌న్‌రైజ‌ర్స్‌

బ‌తికిపోయిన స‌న్‌రైజ‌ర్స్‌

కాగా ఐపీఎల్ 2022 మెగా వేలంలో జేస‌న్ రాయ్‌ను గుజ‌రాత్ టైటాన్స్ 2 కోట్ల రూపాయ‌ల బేస్ ధ‌ర‌కు కొనుగోలు చేసింది. అయితే జేస‌న్ రాయ్‌ను ఐపీఎల్ నుంచి త‌ప్ప‌కోవ‌డం ఇది కొత్తేం కాదు. 2020లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న స‌మ‌యంలో కూడా అర్ధాంత‌రంగా లీగ్ నుంచి త‌ప్పుకున్నాడు. కాగా మెగా వేలంలో జేస‌న్ రాయ్‌ను కొన‌కుండా స‌న్‌రైజ‌ర్స్ మంచి పని చేసిందని క్రీడా విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి ఓ పెద్ద గండం నుంచి స‌న్‌రైజ‌ర్స్ బ‌తికిపోయింద‌ని వారు చెప్పుకొస్తున్నారు.

గ‌త సీజ‌న్లో స‌న్‌రైజ‌ర్స్‌కు ప్రాతినిధ్యం

గ‌త సీజ‌న్లో స‌న్‌రైజ‌ర్స్‌కు ప్రాతినిధ్యం

గ‌త సీజ‌న్లో జేస‌న్ రాయ్ స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. లీగ్‌లో రాణించాడు. కానీ ఈ సారి త‌మ రిటెన్ష‌న్ జాబితాలో రాయ్‌కు స‌న్‌రైజ‌ర్స్ చోటు క‌ల్పించ‌లేదు. మెగా వేలంలో రాయ్‌ను స‌న్‌రైజ‌ర్స్ తిరిగి కొనుగోలు చేస్తుంద‌ని అంతా భావించారు. కానీ అది జ‌ర‌గ‌లేదు. దీంతో అప్పుడు కావ్య మార‌న్‌పై స‌న్‌రైజ‌ర్స్ అభిమానులు విమ‌ర్శ‌లు చేశారు. మంచి ఆట‌గాడిని మెగా వేలంలో ఎందుకు కొనలేద‌ని ప్ర‌శ్నించారు. వేలంలో కావ్య మార‌న్ అత్యంత చెత్త టీంను కొనుగోలు చేసింద‌ని మండిపడ్డారు.

కావ్య మార‌న్ ఇందుకే కొన‌లేదు

కావ్య మార‌న్ ఇందుకే కొన‌లేదు

కానీ తాజాగా జేస‌న్ రాయ్ లీగ్ నుంచి త‌ప్పుకోవ‌డంతో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓన‌ర్ కావ్య మార‌న్ నిర్ణ‌య‌మే స‌రైన‌దంటూ అంతా ప్ర‌శంసిస్తున్నారు. బ‌హుశా ఇలా జ‌రుగుతుంద‌ని కావ్య మార‌న్ ముందే ఊహించి ఉంటుంద‌ని అందుకే మెగా వేలంలో రాయ్‌ను కొనుగోలు చేయ‌లేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కావ్యను స‌రిగ్గా అర్థం చేసుకోలేద‌ని, మెగా వేలంలో ఆమె మంచి టీంను కొనుగోలు చేసింద‌ని కొనియాడుతున్నారు.

కావ్య‌పై ప్ర‌శంస‌లు

కావ్య‌పై ప్ర‌శంస‌లు

కాగా మెగా వేలంలో కావ్య కొనుగోలు చేసిన ప‌లువురు ఆట‌గాళ్ల‌పై మొద‌ట విమ‌ర్శలు వ‌చ్చాయి. అన‌వ‌స‌రంగా ఫాంలో లేని నికోల‌స్ పూర‌న్, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌ను కొనుగోలు చేసిందని ప‌లువురు మండిప‌డ్డారు. కానీ తాజాగా వీరిద్ద‌రు అంత‌ర్జాతీయ క్రికెట్లో సూప‌ర్ ఫాంలో ఉన్నారు. దీంతో కావ్య మార‌న్ మంచి టీంనే కొనుగోలు చేసింద‌ని అంటున్నారు.

Story first published: Tuesday, March 1, 2022, 10:29 [IST]
Other articles published on Mar 1, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+