Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు ముందు టీమిండియాను టెన్ష‌న్ పెట్టే వార్త‌!

Jason Roy Might be Fit to Play Against India: Eoin Morgan

బ‌ర్మింగ్‌హామ్‌: నిజ‌మే! టీమిండియాను కాస్తంత క‌ల‌వర‌పాటుకు గురి చేసే వార్తే ఇది. ఇంగ్లండ్‌తో అతి కీల‌క‌మైన మ్యాచ్ కోసం స‌న్నాహాలు చేస్తోన్న కోహ్లీసేన‌కు టెన్ష‌న్‌కు గురిచేసేదే. ఇంగ్లండ్ డాషింగ్ ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ అందుబాటులోకి వ‌చ్చాడు. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఆదివారం మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు బ‌ర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్ట‌న్ స్టేడియంలో ఆరంభం కాబోయే మ్యాచ్‌లో జేస‌న్ రాయ్ ఆడ‌బోతున్నాడు. ఓపెన‌ర్ జానీ బెయిర్‌స్టోతో క‌లిసి ఇన్నింగ్‌ను ఆరంభించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఇంగ్లండ్ కేప్టెన్ ఇవాన్ మోర్గాన్ స్వ‌యంగా వెల్ల‌డించాడు. జేస‌న్ రాయ్‌తో పాటు ఫాస్ట్ బౌల‌ర్ జోఫ్రా ఆర్చ‌ర్ సైతం వంద‌శాతం ఫిట్‌గా ఉన్నాడ‌ని, వారిద్ద‌రూ టీమిండియాతో త‌ల‌ప‌డే మ్యాచ్‌లో అందుబాటులో ఉంటార‌ని చెప్పాడు.

కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిందే..

కాస్త ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాల్సిందే..

కాలి కండ‌రాలు పట్టేయ‌డంతో ఇదివ‌ర‌కు ఇంగ్లండ్ ఆడిన రెండు మ్యాచుల‌కూ దూరం అయ్యాడు జేస‌న్ రాయ్‌. ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇప్ప‌టిదాకా జేస‌న్ రాయ్ ఆడిన అన్ని మ్యాచ్‌ల‌లోనూ అద్భుతంగా రాణించాడు. ఆ జ‌ట్టు భారీ స్కోరు సాధించ‌డానికి బ‌ల‌మైన పునాదులు వేశాడు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన మ్యాచ్‌లో జేస‌న్ రాయ్ 54 బంతుల్లో 53 ప‌రుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టీమ్ 311 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ద‌క్షిణాఫ్రికాకు నిర్దేశించింది. ఆ మ్యాచ్‌లో ద‌క్షిణాఫ్రికా ఓట‌మి పాలైంది. బంగ్లాదేశ్, ఇంగ్లండ్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో జేస‌న్ రాయ్ విశ్వ‌రూపాన్నే చూపించేశాడు. ఆ ఇన్నింగ్‌ను ఇప్ప‌ట్లో ఎవ‌రూ మ‌రిచిపోలేరు. చిర‌స్మ‌ర‌ణీయ‌మైన ఆట‌తీరును ప్ర‌ద‌ర్శించాడత‌ను. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 153 ప‌రుగులు చేశాడు. దీనికోసం అత‌ను ఎదుర్కొన్న బంతులు 121 మాత్ర‌మే. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌లో 386 ప‌రుగులను ఏసింది.

ఇన్నింగ్ ఆరంభించ‌డం ఖాయం..

ఇన్నింగ్ ఆరంభించ‌డం ఖాయం..

ఇలా అద్భ‌త ఫామ్‌లో ఉన్న జేస‌న్ రాయ్‌.. పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల‌తో జ‌రిగిన చివ‌రి రెండు మ్యాచ్‌ల‌కూ దూరం అయ్యాడు. కాలి కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో మ్యాచ్‌ల‌ను ఆడ‌లేక‌పోయాడు. జేస‌న్ రాయ్ గైర్హాజ‌రీలో ఆడిన రెండింటినీ ఓడిపోయింది ఇంగ్లండ్‌. చివ‌రి మ్యాచ్‌ల‌ను ఓడిపోవ‌డంతో ఇంగ్లండ్ జ‌ట్టు సెమీ ఫైన‌ల్‌కు వెళ్లే అవ‌కాశాలు క్లిష్ట‌త‌రం అయ్యాయి. ఆ జ‌ట్టుకు రెండు మ్యాచ్‌లు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. పైగా టీమిండియా, న్యూజిలాండ్ వంటి రెండు స‌మ‌వుజ్జీల‌ను ఢీ కొట్ట‌బోతోంది. బ‌లహీన‌మైన జ‌ట్లు ఏవైనా ఉంటే ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్ పెద్ద‌గా ఆందోళ‌న చెంది ఉండేది కాదేమో గానీ.. ఇప్పుడు త‌ల‌ప‌డ‌బోతున్నది స‌మ‌వుజ్జీల‌తో. ఈ నేప‌థ్యంలో- జేస‌న్ రాయ్‌ను త‌ప్ప‌నిస‌రిగా ఆడించ‌బోతోంది.

బెయిర్‌స్టోతో క‌లిసి..

బెయిర్‌స్టోతో క‌లిసి..

ఓపెన‌ర్ జేస‌న్ రాయ్ అందుబాటులోకి రావ‌డం ఇంగ్లండ్‌కు క‌లిసి వ‌చ్చే అంశం. జేస‌న్ రాయ్ స్థానంలో జ‌ట్టులోకి తీసుకున్న జేమ్స్ విన్సీ ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాడు. జేస‌న్ రాయ్ జ‌ట్టులోకి తిరిగి రావ‌డంతో అత‌ణ్ని ప‌క్క‌న పెడుతుంది ఇంగ్లండ్ టీమ్ మేనేజ్‌మెంట్‌. జానీ బెయిర్‌స్టోతో క‌లిసి జేస‌న్ రాయ్ ఇన్నింగ్‌ను ఆరంభించ‌డం దాదాపు ఖాయ‌మైన‌ట్టే క‌నిపిస్తోంది. ప్ర‌పంచ‌క‌ప్ ఆరంభ మ్యాచ్‌ల‌ల్లో ఈ ఇంగ్లండ్ ఓపెన‌ర్ల జోడీ జట్టుకు శుభారంభాన్ని ఇచ్చింది. బెయిర్‌స్టో, జేస‌న్ రాయ్ బాగా ఆడిన ప్ర‌తి సంద‌ర్భంలోనూ ఇంగ్లండ్ జ‌ట్టు భారీ స్కోరును సాధించింది. 300కు పైగా ప‌రుగులను ప్ర‌త్య‌ర్థికి నిర్దేశించింది. టీమిండియాతో ఆడ‌బోయే మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ జ‌ట్టు అలాంటి ఆరంభాన్నే ఆశిస్తోంది. జేస‌న్ రాయ్‌, బెయిర్‌స్టో, జో రూట్‌, ఇవాన్ మోర్గాన్‌, బ‌ట్ల‌ర్‌, మొయిన్ అలీ.. వంటి హార్డ్ హిట్ట‌ర్ల‌తో బ్యాటింగ్‌లో రాణిస్తే.. మరోసారి ఇంగ్లండ్ ప‌రుగుల వ‌ర్షాన్ని కురిపించ‌గ‌ల‌ద‌నే భావిస్తున్నారు ఆ దేశ క్రికెట్ అభిమానులు.

Story first published: Sunday, June 30, 2019, 10:34 [IST]
Other articles published on Jun 30, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+