For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్తాన్‌కు పరాభవం..వికెట్లన్నీ స్పిన్నర్లకే: సిరీస్ లాస్: ఓపెనర్ల తడాఖా..

Jason Roy, Adil Rashid shine as England defeats Pakistan in nail biter, clinches series 2-1

లండన్: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు.. తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. పాకిస్తాన్‌ టీమ్‌పై జరిగిన చివరి టీ20లో దుమ్ము రేపింది. రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విన్నర్‌గా నిలిచింది. ఈ గెలపుతో మూడు టీ20ల సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన పాకిస్తాన్ జట్టుకు పరాభవం తప్పలేదు. ఈ సిరీస్‌లో ఓ గెలుపును అందుకున్నప్పటికీ.. దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. తన అస్థిరత్వాన్ని మరోసారి బయటపెట్టుకుంది.

స్పిన్‌కు బలి..

స్పిన్‌కు బలి..

మాంచెస్టర్‌లో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే భారీ స్కోరును చేయగలిగాడు. మిడిలార్డర్‌లో ఫకర్ జమాన్ తప్ప ఎవ్వరూ రాణించలేకపోయారు. స్పిన్‌ బౌలింగ్‌కు దాసోహం అయ్యారు. స్పిన్ బౌలింగ్‌ను ధీటుగా ఎదుర్కొనే జట్టుగా పాకిస్తాన్‌కు పేరుంది. అయినా మాంచెస్టర్ పిచ్‌పై సుడులు తిరిగిన స్పిన్ బౌలింగ్‌‌కు బలి అయింది.

మిడిలార్డర్ టపటపా..

మిడిలార్డర్ టపటపా..

ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ 57 బంతుల్లో 76 పరుగులు చేశాడు. నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో అయిదు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి. మరో ఓపెనర్ బాబర్ ఆజమ్ 11 పరుగులకు అవుట్ అయ్యాడు. మిడిలార్డర్‌లో ఫకర్ జమాన్ 24 పరుగులు చేశాడు. వారిద్దరు తప్ప మరెవరూ భారీ స్కోర్‌ను అందుకోలేకపోయారు. పాకిస్తాన్ ఇన్నింగ్‌ మొత్తానికీ కలిపి అయిదు సిక్సర్లు మాత్రమే రికార్డ్ అయ్యాయంటే- వారి బ్యాటింగ్ ఎంత నాసిరకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వికెట్లన్నీ స్పిన్నర్లకే..

వికెట్లన్నీ స్పిన్నర్లకే..

బౌలర్ హసన్ అలీ తొమ్మిది బంతుల్లో ఒక సిక్సర్, ఒక ఫోర్‌తో 15 పరుగులు బాదడం వల్ల పాకిస్తాన్‌ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. పాకిస్తాన్ ఆరు వికెట్లను కోల్పోగా అందులో అయిదు.. స్పిన్‌ బౌలింగ్‌కే పడ్డాయి. ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లతో చెలరేగిపోయాడు. మొయిన్ అలీ ఓ వికెట్ తీసుకోగా.. ఇమద్ వసీం రనౌట్ అయ్యాడు. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు కూడా తడబడింది. టీ20 ఫార్మట్‌లో ఓ మోస్తరు స్కోరుగా చెప్పుకునే ఈ టార్గెట్‌ను ఛేదించడానికి ఏడు వికెట్లను కోల్పోయింది మోర్గాన్ సేన.

 జేసన్ రాయ్ తడాఖా..

జేసన్ రాయ్ తడాఖా..

ఓపెనర్ జేసన్ రాయ్ దుమ్ము రేపాడు. 36 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 64 పరుగులు చేశాడు. పాకిస్తాన్‌లో కూడా ఓపెనర్ ఒక్కడే రాణించాడు. డేవిడ్ మలన్ 33 బంతుల్లో 31, జోస్ బట్లర్ 21, ఇవాన్ మోర్గాన్ 12 బంతుల్లో 21 పరుగులు చేశాడు. దీనితో లక్ష్యాన్ని చేరుకోవడం సులువైంది. పాకిస్తాన్ ఇన్నింగ్‌లో మహ్మద్ హఫీజ్ మూడు వికెట్లు తీసుకున్నాడు. ఈ ఓటమితో పాకిస్తాన్ టీ20 సిరీస్‌ను 1-2 తేడాతో ఇంగ్లాండ్‌కు ధారదాత్తం చేసుకుంది.

Story first published: Wednesday, July 21, 2021, 7:18 [IST]
Other articles published on Jul 21, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+