Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

West Indies vs England: 4 బంతుల్లో 4 వికెట్ల‌తో హోల్డర్ సంచ‌ల‌నం.. ఇంగ్లండ్‌కు విండీస్ షాక్‌

Jason Holder took 4 wickets in 4 balls.. West Indies won the series 3-2

బార్బ‌డోస్‌: వెస్టిండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ సంచ‌ల‌న బౌలింగ్‌తో అద‌ర‌గొట్టాడు. వ‌రుస‌గా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి దుమ్ములేపాడు. హోల్డ‌ర్ చేసిన సంచ‌ల‌నాత్మ‌క ప్ర‌ద‌ర్శ‌న‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప‌దో ర్యాంకులో ఉన్న వెస్టిండీస్ అదే ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్‌వ‌న్ స్థానంలో ఇంగ్లండ్‌కు గ‌ట్టి షాకిచ్చింది. ఇంగ్లండ్‌ను సొంత గ‌డ్డ‌పై ఓడించి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-2 తేడాతో కైవ‌సం చేసుకుంది. ఇరు జట్ల మ‌ధ్య బార్బ‌డోస్ వేదిక‌గా జ‌రిగిన సిరీస్ ఫ‌లితాన్ని తేల్చే ఐదో టీ20 మ్యాచ్‌లో ఆంగ్లేయ జ‌ట్టును ఓడించి క‌రేబియ‌న్లు టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకున్నారు.

రాణించిన విండీస్ బ్యాట‌ర్లు

రాణించిన విండీస్ బ్యాట‌ర్లు

ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన ప‌ర్యాట‌క జ‌ట్టు వెస్టిండీస్ నిర్ణీత‌ 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగులు చేసింది. విండీస్ కెప్టెన్ కీర‌న్ పొలార్డ్ 25 బంతుల్లో 41 ప‌రుగులు, రోవ్మాన్ పావెల్ 17 బంతుల్లోనే 35 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచారు. వీరిద్ద‌రు చివ‌రి వికెట్‌కు 32 బంతుల్లోనే 74 ప‌రుగుల అజేయ భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు.

ఓపెన‌ర్లు బ్రాండన్ కింగ్ 34, కె మేయర్స్ 31 ప‌రుగుల‌తో రాణించారు. పూర‌న్ 21, శేప్రాడ్ 6 ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ ర‌షీద్, లివింగ్ స్టోన్ రెండేసి వికెట్లు తీశారు.

ల‌క్ష్య‌చేధ‌న‌లో ఇంగ్లండ్ త‌డ‌బాటు

ల‌క్ష్య‌చేధ‌న‌లో ఇంగ్లండ్ త‌డ‌బాటు

అనంత‌రం 180 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. 8 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఓపెన‌ర్ జేస‌న్ రాయ్‌ను అకేల్ హోసేన్ ఔట్ చేశారు. మ‌రో ఓపెన‌ర్ టామ్ బాంటన్ కూడా స్మిత్ బౌలింగ్‌లో 16 ప‌రుగుల‌కే ఔట్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 40 ప‌రుగుల‌కే ఓపెన‌ర్ల వికెట్లు కోల్పోయింది. ఈ క్ర‌మంలో జేమ్స్ విన్స్, కెప్టెన్ మొయిన్ అలీ మూడో వికెట్‌కు 46 ప‌రుగులు జోడించారు.

ఈ క్ర‌మంలో 14 ప‌రుగులు చేసిన అలీ హోల్డ‌ర్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ కాసేప‌టికే 6 ప‌రుగుల‌కే లివింగ్‌స్టోన్ కూడా ఔట‌య్యాడు. అనంత‌రం జ‌ట్టు స్కోర్ 112 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 35 బంతుల్లోనే 55 ప‌రుగుల‌తో హాఫ్ సెంచ‌రీ చేసిన జేమ్స్ విన్స్.. అకేల్ హోసేన్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు. ఆ వెంట‌నే ఫిలిప్ సాల్ట్ కూడా ఔట‌వ‌డంతో ల‌క్ష్య చేధ‌న‌లో ఇంగ్లండ్ 119 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది.

IND vs WI 2022 : Indian Cricket In Good Hands - Darren Sammy | Oneindia Telugu

హోల్డ‌ర్ విశ్వ‌రూపం

ఈ క్ర‌మంలో వికెట్ కీప‌ర్ సామ్ బిల్లింగ్స్ ఇంగ్లండ్‌ను ఆదుకున్నాడు. అయితే జ‌ట్టు స్కోర్ 162 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా విండీస్ ఆల్‌రౌండ‌ర్ జేస‌న్ హోల్డ‌ర్ చెల‌రేగాడు. చివ‌రి ఓవ‌ర్‌లో ఇంగ్లండ్‌కు 18 ప‌రుగులు కావాల్సి ఉండ‌గా హోల్డ‌ర్ ధాటికి ఆశ్చ‌ర్య‌క‌రంగా ఇంగ్లండ్ చివ‌రి 4 వికెట్లను అదే స్కోర్ వ‌ద్ద కోల్పోయి ఆలౌటైంది.

హోల్డ‌ర్ వ‌రుసగా బంతుల్లో 4 వికెట్లు తీసి విశ్వ‌రూపం చూపించాడు. దీంతో ఇంగ్లండ్ 17 ప‌రుగుల తేడాతో ఓట‌మిపాలైంది. హోల్డ‌ర్ బౌలింగ్‌లో జోర్దార్ 7, బిల్లింగ్స్ 41, ఆదిల్ ర‌షీద్, మ‌హ‌మూద్ డ‌కౌట్ అయ్యారు. మొత్తంగా ఈ మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన హోల్డ‌ర్‌కు ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ద‌క్కింది. అలాగే ప్లేయ‌ర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా హోల్డ‌ర్‌నే వ‌రించింది.

Story first published: Monday, January 31, 2022, 9:32 [IST]
Other articles published on Jan 31, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+