వన్డే క్రికెట్ నుంచి స్టార్ క్రికెటర్ రిటైర్మెంట్
వెస్టిండీస్ క్రికెట్ అభిమానులకు ఓ చేదు వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. 34 ఏళ్ల వయస్సులో వెస్టిండీస్ స్టార్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ వన్డే క్రికెట్ నుంచి నిశ్శబ్ధంగా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. జాసన్ హోల్డర్ ఇకపై వన్డేలు ఆడడని వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ ప్రకటించాడు. 34 ఏళ్ల వయస్సులోనే వన్డే క్రికెట్ కు వీడ్కోలు పలకాలన్న హోల్డర్ నిర్ణయం చాలా మంది క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది.
వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ ఇటీవల మాట్లాడుతూ.. జాసన్ హోల్డర్ ఇకపై వన్డే క్రికెట్ ఆడడని.. అయితే టెస్ట్, టీ20 క్రికెట్లో చురుకుగా ఉంటాడని చెప్పాడు. జాసన్ హోల్డర్ తిరిగి టెస్ట్ జట్టులోకి వచ్చే అవకాశం ఉందని.. ఎందుకంటే రెడ్ బాల్ క్రికెట్ అంటే అతడికి చాలా ఇష్టమని.. అతడు మా ప్రధాన ఆల్‌రౌండర్ అంటూ వెస్టిండీస్ హెడ్ కోస్ డారెన్ సామీ విజ్డెన్ క్రికెట్ పాడ్ కాస్ట్‌లో పేర్కొన్నాడు.

జాసన్ హోల్డర్ వన్డే కెరీర్ ఇలా?
జాసన్ హోల్డర్ ఫిబ్రవరి 2013లో వెస్టిండీ తరఫున తన వన్డే అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత జాసన్ హోల్డర్ ఆ జట్టు తరఫున 138 మ్యాచ్‌లు ఆడి, 159 వికెట్లు పడగొట్టాడు. ఈ కాలంలో హోల్డర్ 2,237 పరుగులు కూడా చేశాడు. జాసన్ హోల్డర్ 86 వన్డేలలో వెస్టిండీస్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించగా.. ఆ జట్టు 24 విజయాలు, 54 ఓటములను నమోదు చేసింది. హోల్డర్ తన చివరి వన్డేను జూలై 2023లో ఆడాడు.
ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ ఆడుతున్న హోల్డర్
జాసన్ హోల్డర్ ప్రస్తుతం మేజర్ లీగ్ క్రికెట్ 2026లో ఆడుతున్నాడు. జాసన్ హోల్డర్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్టులో సభ్యుడు. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడాడు. అతను 10 వికెట్లు తీసి, బ్యాట్‌తో 137 పరుగులు చేశాడు. జాసన్ హోల్డర్ ఎల్ఏకేఆర్ కెప్టెన్. ఈ సంవత్సరం తన జట్టును విజయపథంలో నడిపించాలని కోరుకుంటున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications