Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'నైట్‌ వాచ్‌మ్యాన్‌'గా వచ్చి డబుల్‌ సెంచరీ.. ఏ బౌలర్ చేశాడంటే?!!

Jason Gillespie Hits Double-Century, Sets Record For Highest Score by a Nightwatchman

మెల్‌బోర్న్‌: టెస్టుల్లో డబుల్‌ సెంచరీ ఎంతో కీలకం. మేటి బ్యాట్స్‌మన్‌ కూడా ఈ మార్క్ అందుకోవడం కొంచెం కష్టమే. అలాంటిది ఓ పేస్ బౌలర్ డబుల్‌ సెంచరీ చేసాడు. అతడే ఆస్ట్రేలియా మాజీ బౌలర్‌ జాసన్‌ గిలెస్పీ. 'నైట్‌ వాచ్‌మ్యాన్‌'గా వచ్చి డబుల్‌ సెంచరీ కొట్టడం విశేషం. 1996-2006 మధ్య కాలంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ పేస్‌ దళంలో గిలెస్పీ కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ తరపున 71 టెస్టులు, 97 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 259 వికెట్లు, వన్డేల్లో 142 వికెట్లను గిలెస్పీ సాధించాడు.

నైట్‌ వాచ్‌మ్యాన్‌గా బరిలోకి:

నైట్‌ వాచ్‌మ్యాన్‌గా బరిలోకి:

కెవలం బౌలర్‌గా మాత్రమే తెలిసిన గిలెస్పీ.. ఓ అరుదైన డబుల్‌ సెంచరీ రికార్డును తన పేరుపై లికించుకున్నాడు. ఒక నైట్‌వాచ్‌ మ్యాన్‌గా దిగి అత్యధిక స్కోరు సాధించిన రికార్డు ఇప్పటికీ గిలెస్పీ పేరిటే ఉంది. అది జరిగి ఆదివారంకు సరిగ్గా 14 ఏళ్లు. 2006, ఏప్రిల్‌ 19వ తేదీన గిలెస్పీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు ఆట కాసేపట్లో ముగుస్తుందనగా ఓపెనర్ మాథ్యూ హేడెన్‌ ఔటయ్యాడు. దాంతో నైట్‌వాచ్‌ మ్యాన్‌గా గిలెస్పీని పంపింది ఆసీస్ జట్టు.

 డబుల్‌ సెంచరీ:

డబుల్‌ సెంచరీ:

మూడోరోజు మరో వికెట్‌ పడకుండా ఉండటం కోసం గిలెస్పీని ఆసీస్‌ పంపితే.. అతను ఆ తదుపరి రోజంతా క్రీజ్‌లో ఉండి అద్భుతంగా ఆడి డబుల్‌ సెంచరీ చేసాడు. మొత్తం 425 బంతుల్ని ఎదుర్కొన్న గిలెస్పీ.. 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో అజేయంగా 201 పరుగులు చేసి ఆసీస్‌ను పటిష్ట స్థితిలో నిలిపాడు. అతనికి జతగా మైక్‌ హస్సీ (182) కూడా రాణించడంతో ఆసీస్‌ 581 పరుగుల వద్ద తమ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

కెరీర్‌ చివరి టెస్టులో రికార్డు:

కెరీర్‌ చివరి టెస్టులో రికార్డు:

గిలెస్పీ అసాధారణ ప్రదర్శన కామరణంగా ఆసీస్‌కు 384 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ఆపై బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 304 పరుగులకు ఆలౌట్‌ కావడంతో ఆసీస్‌ ఇన్నింగ్స్‌ తేడాతో విజయం సాధించింది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ విజయం సాధించడానికి గిలెస్పీ విశేషంగా రాణించడమే ఒక కారణంగా కాగా.. అతని కెరీర్‌ చివరి టెస్టులో ఈ రికార్డు సాధించడం మరో విశేషం. రిటైర్మెంట్ అనంతరం బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్‌ స్టైకర్స్‌కు చీఫ్‌ కోచ్‌గా గిలెస్పీ చేశాడు.

వారికి బౌలింగ్ చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా:

వారికి బౌలింగ్ చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా:

క‌్రికెట్ దిగ్గ‌జాలు స‌చిన్ టెండూల్క‌ర్‌, బ్రియాన్ లారాను ఔట్ చేయ‌డం క‌ష్ట‌మైన విష‌యమ‌ని.. అయితే ఇద్దరిలో మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్‌ను పెవిలియ‌న్ పంప‌డం మ‌రింత క‌ష్ట‌మ‌ని గెల‌స్పీ అన్నాడు. స‌చిన్‌, లారా భిన్న‌మైన ప్లేయ‌ర్లు. వాళ్లిద్ద‌రినీ ఔట్ చేయ‌డం అంత తేలిక కాదు. అయితే ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి వికెట్ తీయ‌డం క‌ష్టం అంటే మాత్రం అది స‌చిన్ టెండూల్క‌ర్‌దే. లారా కాస్త దూకుడుగానే ఉంటాడు కాబ‌ట్టి అత‌డు త‌ప్పులు చేసే చాన్స్‌లు ఉంటాయి. కానీ స‌చిన్ డిఫెన్స్‌లో సూప‌ర్‌. అత‌డి అడ్డుగోడ‌ను ఛేదించ‌డం చాలా క‌ష్టం. ఇలాంటి గొప్ప ఆట‌గాళ్ల‌కు బౌలింగ్ చేసినందుకు గ‌ర్వ‌ప‌డుతున్నా' అని గెల‌స్పీ తాజాగా పేర్కొన్నాడు.

Story first published: Monday, April 20, 2020, 15:19 [IST]
Other articles published on Apr 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+