Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆర్చర్ అద్భుతమైన పేసర్.. అతడికి పోటీతత్వం ఎక్కువ: గెలెస్పీ

Jason Gillespie feels Jofra Archer is a terrific lad

సిడ్నీ: దూకుడైన స్వభావంతో ఇంగ్లండ్ యువ పేసర్ జోఫ్రా ఆర్చర్ ఇటీవల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అతడికి పొగరు ఎక్కువ అంటూ కొందరు ఆగ్రహం సైతం వ్యక్తం చేశారు. అయితే ఆర్చర్​కు ఆస్ట్రేలియా మాజీ పేసర్ జాస‌న్ గెలెస్పీ మద్దతు తెలిపాడు. ఆర్చర్ అద్భుతమైన పేసర్ అని, అతడిలో పోటీతత్వం ఎక్కువని చెప్పాడు. ఆర్చర్​కు కొందరు పొగరు అని అనుకోవచ్చు.. కానీ అది ఆట పట్ల ఉన్న అంకితభావం అని చెప్పుకొచ్చాడు. గతేడాది వన్డే ప్రపంచకప్ సహా యాషెస్ సిరీస్​లోనూ ఆర్చర్ అద్భుతంగా రాణించాడు. దీంతో విజ్డెన్ క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ జాబితాలోనూ ఆర్చర్​ చోటు దక్కించుకున్నాడు.

జాస‌న్ గెలెస్పీ తాజాగా స్కై స్పోర్ట్స్‌తో మాట్లడుతూ... 'ఆర్చర్ అద్భుతమైన పేసర్​. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే కొన్నిసార్లు అతడి ప్రవర్తనను ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల అసలైన పోటీతత్వం బయటకు రాకపోవచ్చు. కొన్నిసార్లు ప్రవర్తనను బట్టి ఆటగాళ్లు అంకితభావంతో లేరని మనం ఊహించుకోకూడదు' అని గెలెస్పీ చెప్పాడు. 'గతేడాది ప్రపంచకప్​ జరుగుతున్నప్పుడు ఖాళీ సమయంలో ససెక్స్ జట్టు యువ ప్లేయర్ల దగ్గరికి ఆర్చర్ వెళ్లడం చూశా. వారితో అతడు మంచిగా, ఎంతో ఉత్సాహంతో మెలిగాడు' అని గెలెస్పీ చెప్పుకొచ్చాడు.

'ఆర్చర్ బ్యాట్, బంతితో అద్భుత ప్రదర్శన చేస్తాడు. అతను నమ్మకమైన యువకుడు. క్లబ్ జట్టు తనకు అవకాశం ఇచ్చిందని, ఆ విశ్వాసాన్ని తిరిగి చెల్లించాలని అతను భావిస్తాడు. క్లబ్ క్రికెట్లో రాబోయే సంవత్సరాల్లో మనం అతనిని ఎక్కువగా చూస్తామని నేను అనుకోను. ఎందుకంటే అతడు ఇంగ్లండ్ జట్టుతోనే బిజీగా ఉంటాడు. ఆర్చర్ ఒక అద్భుతమైన కుర్రాడు' అని గెలెస్పీ అన్నాడు. గిలెస్పీ ఇంగ్లండ్ కౌంటీ జట్టు ఎసెక్స్‌కు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

ఇటీవలే ట్విటర్ వేదికగా ఓ అభిమాని.. 'మన్కడింగ్ బదులు దాన్ని బిల్‌ బ్రౌన్ అని ఎందుకు పిలవరు?.. అశ్విన్ మన్కడింగ్ చేశాడు అనే దాని కంటే.. బట్లర్ 'బిల్ బ్రౌన్' అయ్యాడు అని అంటే బాగుటుందేమో' అంటూ ఆ వ్యక్తి ట్వీట్ చేశాడు. దీని గిలెస్పీ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. 'దాన్ని మన్కడింగ్ అని పిలిచే బదులు.. మత్తు కారణంగా జరిగిన రనౌట్ అంటే బాగుంటుంది'అంటూ గిలెస్పీ ట్వీట్ చేశాడు. కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో ఇంగ్లండ్‌, వేల్స్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. మే 28 వరకు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది. దీంతో కొత్త సీజన్‌ ఆలస్యం కానుంది.

Story first published: Thursday, April 16, 2020, 16:06 [IST]
Other articles published on Apr 16, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+