కమిన్స్ బౌలింగ్‌లో రామ్‌చరణ్ హీరోయిన్ ఊచకోత! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బిజీగా ఉన్న ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్.. తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో సందడి చేశాడు. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ, త్వరలోనే విడుదల కానున్న టాలీవుడ్ చిత్రం 'పెద్ది' హీరోయిన్ జాన్వీ కపూర్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. విదేశీ క్రికెటర్లు ఇండియాకు వచ్చినప్పుడు ఇక్కడి సినిమా స్టార్లతో కలిసి ఇలాంటి బ్రాండ్ ప్రమోషన్లలో పాల్గొనడం సాధారణమే. గతంలో సన్‌రైజర్స్ మాజీ ఆటగాడు డేవిడ్ వార్నర్ కూడా టాలీవుడ్ సంస్కృతికి ఎంతగానో ప్రభావితమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు కమిన్స్ కూడా అదే బాటలో నడుస్తూ అభిమానులను అలరించాడు.
ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ నిర్వహించి ఈవెంట్లో ప్యాట్ కమిన్స్, జాన్వీ కపూర్ కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. కమిన్స్ అండర్ ఆర్మ్ బౌలింగ్ వేయగా.. జాన్వీ కపూర్ బ్యాటింగ్ చేసింది. గతంలో కొన్ని సినిమాల కోసం క్రికెట్ షాట్స్ ప్రాక్టీస్ చేసిన అనుభవం ఉండటంతో జాన్వీ కపూర్ క్రీజు వదిలి ముందుకు వచ్చి గాల్లోకి భారీ షాట్ కొట్టింది. అయితే ఆమె కొట్టిన బంతి అక్కడ మ్యాచ్‌ను చూస్తున్న ప్రేక్షకులలోని ఒకరి మొబైల్ ఫోన్‌కు బలంగా తాకింది. దీంతో ఆ ఫోన్ స్క్రీన్ పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఈ ఈవెంట్లోనే జరిగిన మరో ఆసక్తికర సంఘటన నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వేదికపై ప్యాట్ కమిన్స్ ఇతరులతో మాట్లాడుతున్న సమయంలో జాన్వీ కపూర్ ఆయనను పిలిచింది. అయితే ఆ క్షణంలో కమిన్స్ ఆమె వైపు చూడకుండా వేరే వాళ్లతో మాట్లాడటంలో మునిగిపోయాడు. కమిన్స్ తనను అలా పట్టించుకోకపోవడంతో జాన్వీ కాస్త అసహనానికి గురైనట్లు కనిపించింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కమిన్స్ ఆమె వైపు తిరిగి మాట్లాడినప్పటికీ.. జస్ట్ కొన్ని సెకన్ల పాటు జాన్వీని కమిన్స్ పట్టించుకోని ఆ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
ఇదిలా ఉండగా.. ఐపీఎల్ 2026లో ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే విజయవంతంగా ప్లేఆఫ్స్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌లలో 8 విజయాలతో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్‌తో సమానంగా మూడో స్థానంలో ఉంది. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ కమిన్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్‌ను ఫైనల్స్ చేర్చిన కమిన్స్.. ఈసారి ఆర్సీబీతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచి, పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలవాలని పట్టుదలగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications