
హైదరాబాద్: టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కొత్త ఇన్నింగ్స్‌ను ఆరంభించనున్నాడు. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ జట్టు కోచ్, మెంటార్‌గా ఇర్ఫాన్ పఠాన్‌ను నియమిస్తూ జమ్మూ అండ్ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ (జేకేసీఏ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జమ్మూ కశ్మీర్ క్రికెట్ అసోసియేషన్‌తో ఒప్పందం చేసుకున్నాడు.
2018-19 సీజన్‌కు గాను ఇర్ఫాన్ పఠాన్‌ను కోచ్, మెంటార్‌గా నియమించిన విషయాన్ని జేకేసీఏ వెల్లడించింది. తమ జట్టుకు ఏడాది పాటు ఇర్పాన్ కోచ్‌గా, మెంటార్‌గా సేవలందించనున్నట్లు జేకేసీఏ సీఈఓ ఆషిక్ బుఖారి తెలిపారు. 33 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ గత రెండు రంజీ సీజన్లలో బరోడా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహారించాడు.
ఇక, 2003-12 మధ్య కాలంలో భారత్ తరపున 29 టెస్టులు, 120 వన్డేలు, 24 అంతర్జాతీయ టీ20లు ఆడాడు. జమ్మూ కాశ్మీర్ జట్టుకు కోచ్, మెంటార్‌గా నియమితుడైన ఇర్ఫాన్ పఠాన్ త్వరలో శ్రీనగర్‌లోని షేర్-ఇ-కశ్మీర్ క్రికెట్ స్టేడియంలో జట్టు సభ్యులను కలుసుకోనున్నాడు.