బీబీఎల్‌లో ఊహించని ఘటన.. ఎప్పుడూ చూడని రీతిలో రనౌట్ (వీడియో)!!

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) ప్రపంచ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతుంది. లీగ్‌లో ఇప్పటికే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆస్ట్రేలియా ఆటగాడు గ్లెన్ మాక్స్‌వెల్ విధ్వంసం సృష్టించగా.. అఫ్గాన్ స్పిన్నర్ అహ్మద్ వినూత్న సంబరాలతో అబిమానులను అలరించాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో హాట్‌టాపిక్ అయ్యాడు. ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ క్రిస్ లిన్ బౌలర్లపై విరుచుకుపడుతూ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా ఆటగాడు క్రిస్ మోరిస్ ఫుట్‌బాల్ తరహాలో బంతిని తన్ని అద్భుతం చేసాడు. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

ఊహించని రనౌట్:
లీగ్‌లో భాగంగా శనివారం సిడ్నీ సిక్సర్స్-మెల్‌బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. మెల్‌బోర్న్ బౌలర్ విల్ సదర్లాండ్ వేసిన ఓ బంతిని సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ జోష్ ఫిలిప్ బౌలర్ వైపు బలంగా బాదాడు. ఫిలిప్ ఆడిన షాట్ నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే బంతిని అందుకోవడంలో బౌలర్ విఫలమయ్యాడు. బౌలర్ చేతుల్లోని జారిన బంతి.. అనూహ్యంగా నాన్‌స్ట్రయిక్‌లో ఉన్న వికెట్లను గిరాటేసింది. బంతి వికెట్లను తాకే సమయానికి నాన్‌స్ట్రయికర్ జేమ్స్ విన్స్ క్రీజు వదలడంతో రనౌట్ అయ్యాడు.

ప్రేక్షకులు షాక్:
అంపైర్ విన్సేను ఔట్‌గా ప్రకటించడంతో.. అసలేం జరిగిందో తెలియక విన్సేతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే రిప్లైలో జరిగిన ఘటన చూశాక విన్సే నిరాశగా పెవిలియన్ బాట పట్టాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో చూసిన నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
సిడ్నీ సిక్సర్స్ ఘన విజయం:
శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. స్టీవ్ స్మిత్ 40 బంతుల్లో అజేయంగా 66 పరుగులు చేయగా.. ఫిలిప్ 42 బంతుల్లో 61 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విన్సే.. 25.75 సగటుతో 309 పరుగులు మాత్రమే చేసాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో 41 నాటౌట్, 51 పరుగులతో ఫామ్‌లోకి వచ్చిన విన్స్.. మెల్‌బోర్న్ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేసి మంచి ఊపులో ఉండగా దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications