
హైదరాబాద్: శ్రీలంకతో తలపడి 0-1తేడాతో ముగించింది న్యూజిలాండ్ జట్టు. ఆ తర్వాత ఫార్మాట్‌గా వన్డే మొదలుపెట్టిన న్యూజిలాండ్ లంక బౌలర్లను ఇరగదీసింది. ఈ క్రమంలోనే 13 బంతులకు 47 పరుగులు చేశాడు కివీస్ బ్యాట్స్‌మన్ జేమ్స్ నీషమ్. ఇలా శ్రీలంక బౌలర్ తిశారా పెరీరా బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు జేమ్స్. ఒకే ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. లంకతో జరుగుతున్న తొలి వన్డే చివరి రెండు ఓవర్లలో నీషమ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 13 బంతుల్లోనే ఆరు సిక్సర్లు సహా 47 పరుగులు చేయడం విశేషం.
మ్యాచ్‌లో మార్టిన్ గఫ్తిల్ ప్రదర్శన కళ్ల ముందు నిలిచిపోయే స్థాయిలో ఉంది. న్యూజిలాండ్ జట్టు నుంచి ఐదో బ్యాట్స్ మెన్‌గా దిగి దేశం తరపున 6000 వన్డే పరుగులు సాధించాడు. గఫ్తిల్ ఇదే మ్యాచ్‌లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ భాగస్వామ్యంలో 163 పరుగులు చేశారు. ఆ తర్వాత 76 పరుగులకు అవుటై వెనుదిరిగాడు. ఆ తర్వాత రోస్ టేలర్ బరిలోకి దిగి 37 బంతుల్లో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
పెరీరా వేసిన 49వ ఓవర్లో ఐదు బంతులను బౌండరీ లైన్ అవతలికి తరలించాడు. ఓవర్లో తొలి నాలుగు బంతులను సిక్సర్లుగా మలిచిన నీషమ్.. చివరి బంతికి మరో సిక్స్ బాదాడు. అందులో ఓ నోబాల్, ఓ టూ, మరో సింగిల్ ఉండటంతో మొత్తం 34 పరుగులు వచ్చాయి. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 371 పరుగులు చేసింది. అంతకుముందు ఓపెనర్ మార్టిన్ గప్టిల్ కూడా సెంచరీ చేశాడు. అతడు 139 బంతుల్లో 138 పరుగులు చేశాడు.
ఒకే ఓవర్లో 34 పరుగులు సాధించడమనేది వన్డే క్రికెట్ చరిత్రలో ఓ అరుదైన విషయం. గతంలో దక్షిణాఫ్రికా ప్లేయర్ హెర్సిల్లె గిబ్స్ (2006/07) ఒక ఓవర్లో 36పరుగులు చేసి ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత శ్రీలంకకు చెందిన తిశారా పెరీరా (2013)దక్షిణాఫ్రికాతో ఆడుతున్న మ్యాచ్‌లో నమోదు చేసి డివిలియర్స్ పేరిట ఉన్న 34పరుగుల రికార్డును బ్రేక్ చేశాడు.