
13 పరుగులకే 2 వికెట్లు
న్యూజిలాండ్ నిర్దేశించిన 167 పరుగుల లక్ష్య ఛేదనలో కివీస్ ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కోల్పోయింది. 13 పరుగులకే కివీస్ మార్టిన్ గప్టిల్, కేన్ విలియమ్సన్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో డారెల్ మిచెల్ (48 బంతుల్లో 73 నాటౌట్, 4ఫోర్లు, 4సిక్స్‌లు), దేవాన్ కాన్వె (46) కివీస్ జట్టును ఆదుకున్నారు. ఈ జోడి ఇంగ్లండ్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న తరుణంలో కాన్వె ఔట్ అవ్వడంతో మూడో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత జోష్ ఫిలిప్స్ (2) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. దాంతో కివీస్ చేయాల్సిన రన్ రేట్ భారీగా పెరిగిపోయింది.

రెండు సిక్సులు, ఓ ఫోర్
చివరి నాలుగు ఓవర్లలో న్యూజిలాండ్ విజయానికి 57 పరుగులు అవసరం అయ్యాయి. అప్పటికీ ఇంగ్లండ్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జేమ్స్ నీషమ్ రెచ్చిపోయాడు. 17వ ఓవర్ తొలి బంతికి సిక్స్ బాదిన నీషమ్.. మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న జానీ బెయిర్‌స్టోకి చిక్కాడు. అయితే బంతిని చేతుల్లోకి తీసుకున్న జానీ.. బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్‌ను తాకడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అంతేకాదు అది సిక్సర్‌గా కలిసొచ్చింది. దీంతో ఆ ఓవర్లో నీషమ్ రెండు సిక్సులు, ఓ ఫోర్ సహా మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు. దీంతో కివీస్ జట్టులో గెలుపు ఆశలు చిగురించాయి.

ప్రశాంతంగా కూర్చిండిపోయిన జిమ్మీ
జేమ్స్ నీషమ్ మెరుపులతో కివీస్ లక్ష్యం కాస్త 18 బంతుల్లో 34గా మారింది. ఆదిల్ రషీద్ వేసిన 18వ ఓవర్లో 14 పరుగులు రావడంతో సమీకరణం 12 బంతులకు 20గా మారింది. ఆ ఓవర్ చివరి బంతికి నీషమ్ ఔట్ అయ్యాడు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇక క్రిస్ వోక్స్ వేసిన 19వ ఓవర్‌లో డెరిల్ మిచెల్ విశ్వరూపం ప్రదర్శించాడు. రెండు భారీ సిక్స్‌లు, ఫోర్‌తో జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. తొలిసారి ఫైనల్‌కు చేరుకున్నామన్న ఆనందంలో డగౌట్లో కివీస్ ప్లేయర్స్ అందరూ ఎగిరిగంతులేయగా.. నీషమ్ మాత్రం అలా ప్రశాంతంగా కూర్చిండిపోయాడు. అదే సమయంలో కెప్టెన్ కూల్ కేన్ విలియమ్సన్ కూడా ఎలాంటి సంబురాలు చేసుకోకుండా.. కాస్త చిరునవ్వు ప్రదర్శించాడు.
పని పూర్తయిందా?
11 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన జేమ్స్ నీషమ్.. సంబురాలు చేసుకోకుండా అలా ప్రశాంతంగా కూర్చిండిపోయే ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తూ.. 'పని పూర్తయిందా?. నాకైతే అలా అనిపించడం లేదు' అంటూ నీషమ్ క్యాప్షన్ పెట్టాడు. అంటే ఫైనల్ మ్యాచ్ ఇంకా మిగిలే ఉందని, లక్ష్యం టైటిల్ గెలవడమే అని జిమ్మీ చెప్పకనే చెప్పాడు. జిమ్మీ ఫొటోపై పలువురు నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈరోజు జరిగే రెండు సెమీఫైనల్లో గెలిచిన జట్టుతో కివీస్ ఫైనల్ ఆడనుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.


Click it and Unblock the Notifications












