ఐపీఎల్‌లో బద్దలు కాని మరో రికార్డు ఇదే (ఫోటోలు)
హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఒక్క మాటలో చెప్పాలంటే బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోన్న టోర్నీ. అంతేకాదు ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు బద్దలవడంతో పాటు ఎన్నో రికార్డులు క్రియేట్ అవుతున్నాయి కూడా. అయితే ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకూ బద్దలు కాని రికార్డు ఒకటి ఆసీస్ ఆటగాడు జేమ్స్ ఫల్క్‌నర్ పేరుతో ఉంది.
ఆ రికార్డు ఏంటంటే ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఐదేసి వికెట్లు తీసిన ఘనతను ఫల్క్‌నర్ సొంతం చేసుకున్నాడు. 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఫల్కనర్ రెండు సార్లూ సన్‌రైజర్స్‌పైనే ఈ ఘనత సాధించాడు. జైపూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 5/20, హైదరాబాద్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో 5/16తో నిలిచాడు.
అంతేకాదు ఒక ఓవర్ మెయిడిన్ ఓవర్ కూడా వేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఆటగాడి రికార్డుని క్రిస్ గేల్ సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ పదో సీజన్‌లో పాత రికార్డులన్నీ బద్దలవుతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు నమోదైన 10 అత్యుత్తమ రికార్డులివే:

జేమ్స్ ఫల్కనర్
ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు ఐదేసి వికెట్లు తీసిన ఘనతను ఫల్క్‌నర్ సొంతం చేసుకున్నాడు. 2013 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన ఫల్కనర్ రెండు సార్లూ సన్‌రైజర్స్‌పైనే ఈ ఘనత సాధించాడు. జైపూర్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో 5/20, హైదరాబాద్‌లో జరిగిన మరో మ్యాచ్‌లో 5/16తో నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు క్రిస్ గేల్‌దే
ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన ఓపెనర్ క్రిస్ గేల్ ఉన్నాడు. పూణెతో జరిగిన మ్యాచ్‌లో క్రిస్ గేల్ 66 బంతుల్లో 13 ఫోర్లు, 17 సిక్సుల సాయంతో 175 నాటౌట్‌గా నిలిచాడు. ఈ రికార్డుని గేల్ 2013 ఐపీఎల్‌లో నమోదు చేశాడు.

అత్యధిక జట్టు స్కోరు బెంగళూరు 263/5
ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా బెంగళూరు నిలిచింది. 2013, ఏప్రిల్ 23న బెంగళూరులో పూణెపై జరిగిన మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో క్రిస్ గేల్ 175 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.

ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడు క్రిస్ గేల్
ఐపీఎల్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా క్రిస్ గేల్ ఉన్నాడు. ఇప్పటివరకు క్రిస్ గేల్ 5 సెంచరీలు చేశాడు. గేల్ తర్వాతి స్ధానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ నాలుగు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత ఏబీ డివిలియర్స్ ఉన్నాడు. డివిలియర్స్ మూడు సెంచరీలు చేశాడు. ఈ ముగ్గురూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు చెందినవారే.

ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీ 973
ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు (973) చేసిన ఆటగాడు కోహ్లీ నిలిచాడు. 16 ఇన్నింగ్స్‌ల్లో విరాట్ కోహ్లీ 4 సెంచరీలు, 7 అర్ధసెంచరీలు చేశాడు. ఒక సీజన్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఆటగాడిగా కూడా కోహ్లీ అరుదైన గుర్తింపు పొందాడు.

హ్యాట్రిక్ వికెట్లు
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మూడు సార్లు హ్యాట్రిక్ వికెట్లు తీసుకున్న బౌలర్‌గా అమిత్ మిశ్రా నిలిచాడు. అయితే ఈ రికార్డుని మూడు జట్ల తరుపున ఆడి సొంతం చేసుకున్నాడు. 2008న ఢిల్లీ డేర్ డెవిల్స్, 2011లో డెక్కన్ ఛార్జర్స్, 2013న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల తరుపున ఆడిన సందర్భంలో అమిత్ మిశ్రా ఈ ఘనత సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications