Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంగ్లాండ్ టెస్ట్ జట్టులో మార్పులు మాములుగా లేవుగా.. న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్‌ కోసం గట్టి టీం

James Anderson, Stuart Broad back into the England squad, team with key changes for Newzealand series

అంతా ఊహించినట్లుగానే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో మార్పులు వేగంగా జరిగిపోతున్నాయి. టెస్టు జట్టు నుంచి ఇప్పటికే తొలగించిన జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌లు తిరిగి జట్టులో చేరారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగబోయే సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌ల కోసం టెస్ట్ జట్టులోకి అండర్సన్, బ్రాడ్ తిరిగి చేరారు. యాషెస్‌ సిరీస్‌లో ఆస్ట్రేలియాలో ఇంగ్లాండ్ పేలవ ప్రదర్శన అనంతరం ఈ ఏడాది ఆరంభంలో జరిగిన వెస్టిండీస్ టూర్‌కు ఈ ఇద్దరు పేసర్లను జట్టు నుంచి తీసేశారు. అయితే ఇటీవలే ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్‌గా బెన్ స్టోక్స్‌ను నియమితుడు కావడం, బ్రెండన్ మెక్కల్లమ్‌ను ప్రధాన కోచ్‌గా నియామకం కావడం లాంటి ప్రధాన మార్పులతో పాటు ఇంగ్లాండ్ బోర్డు పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. టెస్ట్ జట్టులో ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్‌ 13మంది సభ్యులతో కూడిన జట్టులో మళ్లీ చోటు దక్కించుకున్నారు.

గాయాల వల్ల స్టార్ బౌలర్లు దూరం

గాయాల వల్ల స్టార్ బౌలర్లు దూరం

ఇక ఇంగ్లాండ్ టెస్ట్ క్రికెట్ జట్టును వేధిస్తున్న ప్రధాన సమస్య ఆ జట్టులోని బౌలర్లు తీవ్రంగా గాయపడడం. ఆ జట్టు బౌలింగ్ యూనిట్లో నిఖార్సైన ప్లేయర్లు చాలా మంది ఉన్నారు. అందులో క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, సామ్ కరాన్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్ వంటి పలువురు సీమర్లు గాయాల వల్ల వచ్చే నెల న్యూజిలాండ్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో అండర్సన్, బ్రాడ్ సేవలు జట్టుకు అవసరమయ్యాయి. ఇక స్వదేశంలో అండర్సన్, బ్రాడ్ తమ స్వింగ్‌తో చెలరేగుతారనే విషయం తెలిసిందే. అలాగే ఈ సిరీస్‌కు కొత్త ప్లేయర్లను కూడా ఇంగ్లాండ్ బోర్డు తీసుకుంది. యార్క్‌షైర్‌కు చెందిన హ్యారీ బ్రూక్, డర్హామ్‌కు చెందిన మాథ్యూ పాట్స్ ఈ సిరీస్‌లో భాగంగా అరంగేట్రం చేయనున్నారు. ప్రస్తుత కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో బ్రూక్ ఇప్పటికే 151.60సగటుతో 758పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉండగా.. పాట్స్ 35వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

కొత్త శకానికి నాంది పలుకుతాం

కొత్త శకానికి నాంది పలుకుతాం

బెన్ స్టోక్స్ సారథ్యంలో మరియు బ్రెండన్ మెక్కల్లమ్ మార్గదర్శకత్వంలో మా టెస్ట్ జట్టుకు మళ్లీ పునరుత్తేజంతో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఇంగ్లాండ్ మెన్స్ క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ పేర్కొన్నారు. యువ ప్లేయర్లు, అనుభవమున్న ప్లేయర్ల సమతూకంతో మేము వచ్చే నెలలో జరిగే టెస్ట్ సిరీస్‌లో న్యూజిలాండ్‌తో పోటీపడగల అద్భుతమైన జట్టును ఎంపిక చేశామని ప్రస్తావించారు. కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమంగా రాణించిన ఆటగాళ్లయిన హ్యారీ బ్రూక్, మ్యాటీ పాట్స్‌‌లను జట్టులో చేర్చామని తెలిపారు. వారు ఇంగ్లాండ్ టీంలో చేరడానికి అర్హులైన వారని గుర్తించే వారికి ఈ అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు.

 జూన్ 2నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం

జూన్ 2నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం

ఇకపోతే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 2న లార్డ్స్‌లో ప్రారంభం కానుంది. తర్వాత వరుసగా నాటింగ్‌హామ్, లీడ్స్‌లో మరో రెండు టెస్టులు జరుగుతాయి. ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ కెప్టెన్సీపై, మెక్కల్లమ్ సారథ్యంపై భారీగా అంచనాలున్నాయి. ఈ క్రమంలో ఈ సిరీస్‌‌లోని తొలి రెండు టెస్టులకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రతిపాదించిన జట్టులో ఎవరెవరు ఉన్నారంటే..

ఇంగ్లాండ్ జట్టు : బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జోనాథన్ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్‌టన్, మాథ్యూ పాట్స్, ఆలీ పోప్, జో రూట్.

Story first published: Wednesday, May 18, 2022, 21:01 [IST]
Other articles published on May 18, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+