Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

30,020: ఫాస్ట్ బౌలర్లలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఆండర్సన్

James Anderson sets Test world record for fast bowlers with his 30,020th delivery

హైదరాబాద్: క్రికెట్‌లో బ్యాట్స్‌మన్ పరుగులు సాధించడం సులువు. అదే బౌలర్ బంతులు వేయడం కష్టం. బ్యాట్స్‌మెన్‌తో పోలిస్తే బౌలర్లు తమ క్రికెట్ కెరీర్‌ను ఎక్కువ రోజులు కొనసాగించిన దాఖలా లేదు. అలాంటిది ఓ ఫాస్ట్ బౌలర్ 30వేలకు పైగా బంతులేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ మాత్రం ఆ ఘనత సాధించాడు.

 ఆండర్సన్ అరుదైన రికార్డు

ఆండర్సన్ అరుదైన రికార్డు

అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డుని తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధికంగా 30,020 బంతులు వేసిన ఫాస్ట్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. అంతకముందు వెస్టిండిస్ క్రికెట్ దిగ్గజం కోర్ట్నీ వాల్ష్ 30,019 బంతులేసిన తొలి ఫాస్ట్‌ బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పుడు ఆ రికార్డుని జేమ్స్ ఆండర్సన్ అధిగమించాడు.

 500 వికెట్లు తీసుకున్నతొలి క్రికెటర్‌గా కోర్ట్నీవాల్ష్

500 వికెట్లు తీసుకున్నతొలి క్రికెటర్‌గా కోర్ట్నీవాల్ష్

క్రైస్ట్ చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టు ఆఖరి రోజైన మంగళవారం ఈ రికార్డును ఆండర్సన్ నెలకొల్పాడు. టెస్టుల్లో 500 వికెట్లు తీసుకున్నతొలి క్రికెటర్‌గా కోర్ట్నీవాల్ష్ పేరిట రికార్డు ఉంది. 2001లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన కోర్ట్నీవాల్ష్ తన కెరీర్‌లో 24.44 సగటుతో 519 వికెట్లు తీశాడు. అదే జేమ్స్ ఆండర్సన్ విషయానికి వస్తే 27.34 సగటుతో ఇప్పటి వరకు 531 వికెట్లు పడగొట్టాడు.

ఇంగ్లాండ్ తరుపున విజయవంతమైన బౌలర్

ఇంగ్లాండ్ తరుపున విజయవంతమైన బౌలర్

అంతేకాదు ఇంగ్లాండ్ తరఫున అత్యంత విజయవంతమైన బౌలర్‌గా ఆండర్సన్ పేరుంది. మొత్తంగా చూస్తే టెస్టు క్రికెట్‌ చరిత్రలో అత్యధిక బంతులేసిన బౌలర్ల జాబితాలో జేమ్స్ ఆండర్సన్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. టాప్-3లో ఉన్న ముగ్గురు స్పిన్నర్లే కావడం విశేషం. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 44,039 డెలివరీలు వేసి ఈ జాబితాలో అగ్రస్థానంలొ కొనసాగుతున్నాడు.

రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం

రెండో టెస్టులో ఇంగ్లాండ్‌పై ఆసీస్ ఘన విజయం

టెస్టు కెరీర్‌లో 800 వికెట్లు తీసి ప్రపంచ రికార్డును కూడా నెలకొల్పాడు. ఇక, భారత స్పిన్ లెజెండ్ అనిల్ కుంబ్లే(40,850 బంతులు, 619 వికెట్లు), ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్(40,705 బంతులు, 708 వికెట్లు) అత్యధిక బంతులేసిన జాబితాలో ఉన్నారు. క్రైస్ట్ చర్చ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 1-0తో న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. ఈ టెస్టులో కనీసం డ్రాతోనైనా బయటపడాలంటే తప్పక నిలవాల్సిన మ్యాచ్‌లో కివీస్ అద్భుత ప్రదర్శన చేసింది. 1999 తర్వాత ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడం ఇదే మొట్టమొదటి సారి.

Story first published: Tuesday, April 3, 2018, 14:13 [IST]
Other articles published on Apr 3, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+