
కోహ్లీకి బౌలింగ్ చేయడం కష్టమే:
తాజాగా పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో జేమ్స్ అండర్సన్ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీ లాంటి ఆటగాడికి బౌలింగ్ చేయడం ఎప్పటికీ కష్టమే. అయితే అదెంత కష్టమైనా నాకు సరదాగా ఉంటుంది. దాన్నే నేను ఆస్వాదిస్తాను. ఎప్పుడైనా మేటి ఆటగాళ్లనే ఔట్ చేయాలని ఉంటుంది. 2014లో ఇంగ్లండ్ పర్యటనకు వచ్చినప్పుడు కోహ్లీపై ఆధిపత్యం చెలాయించాను. అప్పుడు చాలా త్వరగా బ్యాట్‌ను కదిలించేవాడు. దాంతో నేను విసిరే ఔట్ స్వింగర్లు ఆడబోయి ఔటయ్యేవాడు. అలా నాకు కలిసొచ్చింది' అని తెలిపాడు.

చాలా ఓపికతో ఆడాడు:
'2018 పర్యటనలో విరాట్ కోహ్లీ ఎంతో మారిపోయాడు. తన ఆటలో పరిణతి కనిపించింది. అప్పుడు చాలా ఓపికతో ఆడాడు. బౌలర్లకు విసుగొచ్చేలా చేసి మరీ పరుగులు రాబట్టాడు. కెప్టెన్‌గా మంచి ప్రదర్శన చేశాడు' అని జేమ్స్ అండర్సన్ అన్నాడు. పాకిస్తాన్ టెస్ట్ సిరీస్ సందర్భంగా జిమ్మీ టెస్టుల్లో 600 వికెట్లు పడగొట్టాడు. మూడో టెస్టులో చివరి రోజు అజర్ అలీని ఔట్ చేసి ఆ ఘనత అందుకున్నాడు. స్పిన్నర్లు ముత్తయ్యమురళీ ధరన్ (800), షేన్ వార్న్ (708), అనిల్ కుంబ్లే (619) మాత్రమే 600పై చిలుకు వికెట్లు తీశారు. ఇప్పుడు అండర్సన్ కూడా ఆ క్లబ్‌లో చేరిపోయాడు. అయితే జిమ్మీ ఒక ఫాస్ట్‌బౌలర్‌గా ఈ ఘనత సాధించిడం విశేషం.

8 ఇన్నింగ్స్‌ల్లో 593 పరుగులు:
2014 ఇంగ్లండ్ పర్యటనలో పూర్తిగా విఫలమైన విరాట్ కోహ్లీ.. అప్పుడు తీవ్ర విమర్శల పాలయ్యాడు. 10 ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 134 పరుగులే చేశాడు. అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోనీ పూర్తి మద్దతు ఇచ్చాడు. ఇక 2018కి వచ్చేసరికి కోహ్లీ పూర్తిగా మారిపోయాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు, మూడు అర్ధ శతకాలతో మొత్తం 593 పరుగులు చేశాడు. దాంతో ఆ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి.. ఇంగ్లీష్ పిచ్‌లపై ఆడలేడనే విమర్శలను తిప్పికొట్టాడు.


Click it and Unblock the Notifications












