For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లి కాదు.. ఆ భారత బ్యాటర్ భయపెట్టాడు!- అండర్సన్

ఇంగ్లండ్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ తన చివరి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాడు. లార్డ్స్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచే అతని కెరీర్‌లో ఆఖరిది. 41 ఏళ్ల ఈ పేసర్ ఎన్నో ఘనతలు సాధించాడు. రికార్డులు బద్దలు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్‌గా, అత్యధిక బంతులు సంధించిన పేసర్‌గా అరుదైన ఘనతలన్నీ అతని ఖాతాలోనే ఉన్నాయి.

రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అండర్సన్ ఎంతోమంది హేమాహేమీ బ్యాటర్లను ఎదుర్కొన్నాడు. సచిన్ టెండూల్కర్ నుంచి నుంచి యువ స్టార్ శుభ్‌మన్ గిల్ వరకు అతను బౌలింగ్ చేశాడు. టెస్టుల్లో సచిన్ X అండర్సన్, విరాట్ కోహ్లి X అండర్సన్ ఫైట్ ఎంతో ఆసక్తికరంగా సాగిన విషయం తెలిసిందే.

James Anderson Praises Sachin Tendulkar The Best Batter I Ever Faced No Room for Error

అయితే తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాటర్ గురించి అండర్సన్ వివరించాడు. సచిన్ టెండూల్కర్ అత్యంత ప్రమాదకర బ్యాటర్ అని కొనియాడాడు. సచిన్‌కు బౌలింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉంటానని, కొంచెం కూడా ఏమరపాటుకు గురికాకుండా ఉండటానికి ప్రయత్నించానని చెప్పాడు. సచిన్‌ను ఔట్ చేస్తే భారత్‌ను ఆలౌట్ చేయడం సులభంగా మారేదని పేర్కొన్నాడు.

''సచిన్ టెండూల్కర్ అత్యుత్తమ బ్యాటర్. సచిన్‌ కోసం చేసిన ప్రత్యేమైన ప్రణాళికలు గుర్తులేవు. కానీ అతను క్రీజులోకి వస్తే.. ఒక్క చెత్త బంతి కూడా వేయకూడదని నిర్ణయించుకుంటా. అతను అంతటి గొప్ప ప్లేయర్. సచిన్ భారత్‌కు ఎంతో ప్రధానమైన బ్యాటర్. అతన్ని ఔట్ చేస్తే వాతావరణం మారిపోతుంది. మ్యాచ్ పరిస్థితులు మారిపోతాయి. అతని వికెట్ ఎంతో కీలకం''

''ఇంగ్లండ్‌లో సచిన్‌కు భిన్నమైన రికార్డు ఉంది. ఆదిలోనే అతన్ని ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేయడానికి ప్రయత్నించేవాడిని. అతనిపై కొంత నేను జయించాను. అదే విధంగా అతను కూడా నాపై విజయం సాధించాడు. మాపై అతను ఎన్నో పరుగులు చేశాడు. ఇక భారత్‌పై నేను సాధించిన 81 పరుగులు నా కెరీర్‌‌లో గొప్పదిగా భావిస్తాను. బ్యాటుతో ఎలా సత్తాచాటానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా'' అని అండర్సన్ పేర్కొన్నాడు.

2014లో నాటింగ్‌హమ్ వేదికగా జరిగిన భారత్-ఇంగ్లండ్ మ్యాచ్ డ్రాగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో ఆఖరి బ్యాటర్‌గా వచ్చిన అండర్సన్ 81 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ (47)తో కలిసి 198 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ ఇన్నింగ్స్‌లో జిమ్మీ 17 ఫోర్లు బాదడం విశేషం.

Story first published: Friday, July 12, 2024, 13:23 [IST]
Other articles published on Jul 12, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+