జేమ్స్ అండర్సన్ ముందు బ్రెండన్ మెక్కల్లమ్ బచ్చా ప్లేయర్.. కానీ ఇప్పుడు మెక్కల్లమ్ కోచింగ్లో అండర్సన్ ఆట

మూడు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 132పరుగులకే కుప్పకూలింది. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ తొలుత బాగా ఆడింది. మూడో సెషన్ టీ బ్రేక్ తర్వాత బ్యాటర్లు చేతులెత్తేశారు. జాకీ క్రాలీ(43) మినహా మిగతవారందరూ పుటపుట ఔటయ్యారు. దీంతో 75పరుగులకు 1వికెట్ కోల్పోయి కమాండింగ్ పొజిషన్లో ఉన్న ఇంగ్లాండ్.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 7వికెట్లు కోల్పోయి 116పరుగుల దారుణ పరిస్థితికి చేరుకుంది. ప్రస్తుతం క్రీజులో బెన్ ఫోక్స్ (6), స్టువర్ట్ బ్రాడ్ (4) ఉన్నారు. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ 2, బౌల్ట్ 2, జేమీసన్ 2, గ్రాండ్ హోమ్ 1 వికెట్ తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పారు. ఇక ఒక్క రోజే లార్డ్స్ టెస్ట్‌లో 17వికెట్లు పడడం గమనార్హం. దీన్ని బట్టి లార్డ్స్ పిచ్ పూర్తిగా బౌలింగ్ పిచ్ అని అర్థం అవుతుంది. ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టులోకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన 40ఏళ్ల జేమ్స్ అండర్సన్ 4/66తో చెలరేగాడు. ఇక ఆండర్సన్ విషయంలో చాలా ఆసక్తికర విషయాలు ఈ మ్యాచ్ ద్వారా వెలుగుచూశాయి.
అండర్సన్ ఆడేనాటికి మెక్కల్లమ్ ఒక్క టెస్ట్ కూడా ఆడలేదు.
2022 జూన్‌లో అంటే నేటి మ్యాచ్‌లో లార్డ్స్ వేదికపై 4/66ప్రదర్శనతో చెలరేగిన జేమ్స్ అండర్సన్.. ప్రస్తుతం ఇంగ్లాండ్ కొత్త కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్ మార్గదర్శకత్వంలో ఆడుతున్నాడు. అయితే అండర్సన్ టెస్టుల్లో అరంగేట్రం చేసే నాటికి మెక్కల్లమ్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడలేదు. 2003 మేలో అండర్సన్ టెస్టులో ఇంగ్లాండ్ తరఫున అరంగేట్రం చేశాడు. ఇక జింబాబ్వేపై లార్డ్స్ వేదికగా అరంగేట్రం చేసిన అండర్సన్ అప్పట్లో 5/73ప్రదర్శనతో చెలరేగాడు. ఇక అప్పటికీ మెక్కల్లమ్ ఒక్క అంతర్జాతీయ టెస్టు కూడా ఆడలేదు. అంటే అండర్సన్ కన్న మెక్కల్లమే బచ్చే ఆటగాడు. కానీ ప్రస్తుతం సీన్ మాత్రం.. మెక్కల్లమ్ కోచ్ గా కొనసాగుతుంటే.. అండర్సన్ ఇంకా ప్లేయర్‌గా ఆడుతున్నాడు. ఇక మెక్కల్లమ్ కోచింగ్లోనే అండర్సన్ ఆడుతుండడం మరో విశేషం.
మెక్కల్లమ్ ను అత్యధిక సార్లు ఔట్ చేసింది కూడా..
ఇకపోతే తొలి టెస్టులో రీఎంట్రీ ఇచ్చిన స్టువర్ట్ బ్రాడ్.. అంతర్జాతీయ క్రికెట్లో బ్రెండన్ మెక్కల్లమ్‌ను అత్యధికంగా 10సార్లు ఔట్ చేశాడు. అలాగే జేమ్స్ అండర్సన్ 8సార్లు ఔట్ చేశాడు. ఇక మెక్కల్లమ్‌ను అత్యధికంగా ఔట్ చేసిన వారిలో టాప్ 1లో స్టువర్ట్ బ్రాడ్ ఉండగా.. 3వ స్థానంలో అండర్సన్ ఉన్నాడు. శ్రీలంకన్ లెజెండరీ ప్లేయర్ ముత్తయ్య మురళీ ధరన్ 9సార్లు, ఇండియన్ మాజీ పేసర్ జహీర్ ఖాన్ 8సార్లు, శ్రీలంక మాజీ ప్లేయర్ రంగన్ హెరత్ 8సార్లు మెక్కల్లమ్‌ను ఔట్ చేశారు. ఇప్పుడు స్టువర్ట్ బ్రాడ్, అండర్సన్ మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతుంటే.. మిగతా వారు రిటైరైపోయారు. ప్రస్తుతం కోచ్ మెక్కల్లమ్ మార్గదర్శకత్వంలో ఇంగ్లాండ్‌కు వీరిద్దరు ఆడుతుండడం గమనార్హం.
సింగిల్ గ్రౌండ్లో అత్యధిక సార్లు బౌలింగ్ వేసిన ప్లేయర్‌గా
ఇకపోతే ఈ మ్యాచ్‌లో అండర్సన్ ఓ అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఒకే గ్రౌండ్స్‌లో అత్యధిక ఇన్నింగ్స్ లలో బౌలింగ్ చేసిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఒకే గ్రౌండ్లో అత్యధిక టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడిన టాప్-5 ప్లేయర్లు
50 ఇన్నింగ్స్‌లు - లార్డ్స్ గ్రౌండ్లో జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్)
49 ఇన్నింగ్స్‌లు - లార్డ్స్ గ్రౌండ్లో స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లాండ్)
46 ఇన్నింగ్స్‌లు - కోలొంబో గ్రౌండ్లో ముత్తయ్య మురళీ ధరన్ (శ్రీలంక)
40 ఇన్నింగ్స్‌లు - కొలొంబో గ్రౌండ్లో చమీందా వాస్ (శ్రీలంక)
38 ఇన్నింగ్స్‌లు - వెల్లింగ్టన్ గ్రౌండ్లో డానియల్ వెటోరీ (న్యూజిలాండ్)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications