Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

James Anderson : ఎప్పుడు రిటైర్ అవుతానో తెలీదు కానీ అప్పటి వరకు ఆడతా

James Anderson Gave Hint About His Career

ఈ నెల ప్రారంభంలో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్‌తో రీషెడ్యూల్ చేసిన అయిదో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ సీనియర్ స్టార్ బౌలర్ అండర్సన్ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. అతను ఈ టెస్ట్ మ్యాచ్‌లోని స్టార్‌లలో ఒకడు. ఇండియా తొలుత బ్యాటింగ్ చేయగా.. అతను తన మొదటి ఇన్నింగ్స్‌లో 5వికెట్లు సాధించాడు. ఇక ఈ మ్యాచ్‌లో స్టోక్స్, బెయిర్ స్టో చెలరేగడంతో ఇండియా ఓడిపోయింది. తద్వారా ఈ టెస్ట్ సిరీస్‌ 2-2తో సమమైంది. ఇక 39ఏళ్ల అండర్సన్ తాను ఇంకెంత కాలం ఆడుతాడో ఓ హింట్ ఇచ్చాడు. తాను ఎప్పటివరకు ఆడతానో తెలీదు గానీ.. మరోసారి విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయడానికి ఇష్టపడతానని అండర్సన్ చెప్పాడు. ఇక కోహ్లీని మళ్లీ ఎదుర్కోవడానికి ఇండియాతో తదుపరి పర్యటన వరకు తాను కెరీర్ కొనసాగించొచ్చని అతను చెప్పాడు. అండర్సన్, కోహ్లీ మధ్య బ్యాటిల్ అత్యుత్తమ బౌలర్ మరియు బ్యాటర్ల మధ్య పోరులలో ఒకటి అని పేర్కొనవచ్చు. ఇక అండర్సన్ 7సార్లు కోహ్లీని ఔట్ చేశాడు.

ఇక సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఎక్స్ ట్రా ఇన్నింగ్స్‌లో అండర్సన్ మాట్లాడుతూ.. 'నేను ఇంకెంత కాలం ఆడతానో నాకు తెలియదు. కానీ నేను మళ్లీ విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి.. బహుశా నేను ఇండియా తదుపరి పర్యటన వరకు ఆడతానేమో' అని పేర్కొన్నాడు. టెస్టుల్లో అండర్సన్ కోహ్లీని ఏడు సార్లు ఔట్ చేయగా.. వాటిలో ఐదు 2014లో కోహ్లీ తన తొలి ఇంగ్లాండ్ పర్యటన ఆడుతున్నప్పుడు తీసిన వికెట్లు కాగా.. 2016-17లో ఇంగ్లాండ్ టూర్‌లో ఐదుసార్లు కోహ్లీని అండర్సన్ అవుట్ చేయలేకపోయాడు. ఇక చివరిసారి ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్లో కోహ్లీని అండర్సన్ రెండుసార్లు ఔట్ చేశాడు.

Story first published: Tuesday, July 19, 2022, 16:03 [IST]
Other articles published on Jul 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+