Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

గేల్ సెక్స్ పిచ్చోడా..! : రాయడానికి కూడా వీలుకాని సెక్స్ కామెంట్స్..

లండన్ : విధ్యంసకర బ్యాటింగుకు మారుపేరైన క్రిస్ గేల్, వివాదాలకు కేరాఫ్ గా మారుతున్నాడు. ఇంటర్వ్యూల్లో తన నోటి దురుసును బయటపెట్టుకుంటూ విమర్శల పాలవుతున్నాడు. గతంలోను 'నాతో డేటింగ్ కి వస్తావా' అంటూ లైవ్ షో లో స్పోర్ట్స్ యాంకర్ పట్ల తలతిక్కగా వ్యవహరించిన గేల్, తాజాగా మరోసారి తీవ్ర అసభ్య వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది.

ప్రస్తుత ఐపీల్ సీజన్ లో బెంగుళూరు జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న గేల్, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దుమారం రేపే వ్యాఖ్యలు చేశాడు. ప్రఖ్యాత బ్రిటీష్ దినపత్రిక 'ద టైమ్స్' గేల్ ఇంటర్వ్యూ బాధ్యతలను స్పోర్ట్స్ యాంకర్ చార్లెట్ ఎడ్వర్డ్స్ కు అప్పగించింది. ఈ నేపథ్యంలో గేల్ ను ఇంటర్వ్యూ చేసిన ఆమెకు గేల్ వెకిలి వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయి.

మహిళల సమానత్వం గురించి మాట్లాడాలని సదరు యాంకర్ గేల్ ని కోరగా.. "మహిళలు సమానత్వం కంటే ఎంజాయ్ చేయడం గురించే ఎక్కువగా ఆలోచిస్తారని, తమ దేశంలో రిలాక్స్ కోసమే ఎక్కువమంది సెక్స్ లో పాల్గొంటారనే భావన ఉందని" తెలిపాడు. అక్కడితో ఆగకుండా.. తలతిక్కగా వ్యవహరించిన గేల్, "నాది చాలా పెద్ద బ్యాటు, ఎత్తడానికి నీకైతే రెండు చేతులు కావాల్సిందే, నువ్వెప్పుడైనా థ్రీసమ్ సెక్స్ చేశావా..!" అంటూ యాంకర్ కి చిర్రెత్తుకొచ్చే వ్యాఖ్యలు చేశాడు.

Jamaican cricketer Chris Gayle makes controversial comments to female journalist about sex and equality

అంతటితోను గేల్ వెకిలి వ్యాఖ్యలకు ఫుల్ స్టాప్ పడలేదు. "మహిళలకు చాలా సమానత్వముందని, తాము కోరుకున్నదేదైనా చేయగలరని, దృఢంగా ఉండే చాలామంది జమైకా మహిళలు తమకు ఎప్పుడో కావాలో స్వయంగా వాళ్లే తెలుపుతారని" పరోక్ష ద్వంద్వార్థాలతో కంపరం పుట్టించే విధంగా కామెంట్స్ చేశాడు. పనిలో పనిగా తనని తాను అందగాడిగా కూడా కితాబిచ్చేసుకున్నాడు ఈ తలబిరుసు క్రికెటర్.

ఇక ఇంట్లో తన ప్రవర్తన గురించి స్పందిస్తూ.. ఇంట్లో కూతురు డైపర్లు మార్చడం తప్ప, ఇళ్లు ఊడ్చడం గురించి గానీ, వంట చేయడం గురించి గానీ అసలు ఆలోచించనని అదంతా తన ప్రియురాలు నటాషా బెరిడ్జ్ పనేనని చెప్పుకొచ్చాడు. ఉద్యోగం చేసే భార్యలైనా సరే, భర్త కంటే ముందుగా ఇంటికి చేరుకుని వంట సిద్దం చేసి ఉంచాలని, మహిళలు తమ పురుషులను సంతోషపెట్టడం గురించి ఆలోచించాలని ఉచిత సలహాలు కూడా ఇచ్చేశాడు.

ఇదిలా ఉంటే, గేల్ వ్యాఖ్యలపై అటు ప్రపంచ క్రికెట్ లోను, మీడియాలోను పెనుదుమారం రేగుతోంది. గేల్ ను ఇంటర్వ్యూ చేసిన స్పోర్ట్స్ జర్నలిస్ట్ చార్లెట్ అతని వ్యాఖ్యల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+