Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'గేల్ నిన్ను తప్పించడంలో శర్వాణ్‌ పాత్ర లేదు.. సవాలక్ష కారణాలున్నాయి'

Jamaica Tallawahs says Sarwan was not involved in decision to not retain Chris Gayle for CPL 2020

జమైకా: కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌)లో జమైకా తలవాస్‌ జట్టు నుంచి తనను తొలగించడానికి ఆ జట్టు కోచ్‌ రామ్‌ నరేశ్‌ శర్వాణ్‌ కారణమంటూ విండీస్ సీనియర్ ఓపెనర్ క్రిస్‌ గేల్‌ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ జట్టు తనను కొనసాగించకపోవడానికి శర్వాణ్‌ పాత్ర కీలకమని, అతను కరోనా కంటే ప్రమాదమని గేల్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. అయితే గేల్ వాఖ్యలను జమైకా తలవాస్‌ ఖండించింది. శర్వాణ్‌ పాత్ర ఏమీలేదని, తప్పించడానికి సవాలక్ష కారణాలున్నాయి అని స్పష్టం చేసింది.

సవాలక్ష కారణాలున్నాయి:

సవాలక్ష కారణాలున్నాయి:

జమైకా తలవాస్ తాజాగా ఓ ప్రకటన విధుల చేసింది. 'క్రిస్‌ గేల్‌ కాస్త తగ్గి మాట్లాడితే మంచిది. నిన్ను తీసివేయడానిక సవాలక్ష కారణాలున్నాయి. బహిరంగ విమర్శలు సరికాదు. నిన్నుతప్పించడంలో శర్వాణ్‌ పాత్ర ఏమీ లేదు. ఇక్కడ సెలక్షన్‌ కమిటీ, ఫ్రాంచైజీ ఉంది. నిన్నుఫ్రాంచైజీ కొనసాగించకూడదని నిర్ణయించుకుంది. దాంతోనే కొనసాగించలేదు. అంతే కానీ ఏ ఒక్కరూ నిన్ను తీసివేయడానికి కారణం కాదు' అని తలవాస్‌ ఆ ప్రకటనలో పేర్కొంది.

 శర్వాణ్​ అసంతృప్తి:

శర్వాణ్​ అసంతృప్తి:

గేల్​పై శర్వాణ్​ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. గేల్​ను తప్పిస్తూ తలావాస్​ తీసుకున్న నిర్ణయంలో నా ప్రమేయమే లేదని తేల్చి చెప్పాడు. తనపై గేల్ తప్పుడు ఆరోపణలు చేశాడని శర్మాణ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. గేల్​ను ఎంతో ప్రతిభావంతుడిగా, స్నేహితుడిగా తాను ఎంతో గౌరవించానని.. అలాంటిది తనపైనే ఆరోపణలు చేయడంతో షాక్​కు గురయ్యానని శర్వాణ్ చెప్పాడు.

మూడేళ్ల పాటు కాంటాక్ట్:

మూడేళ్ల పాటు కాంటాక్ట్:

2019లో జమైకా తలవాస్‌ జట్టులోకి తిరిగి వచ్చిన గేల్‌.. అంతకుముందు 2013 నుంచి 2016 వరకూ ఆ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. గతేడాది గేల్‌ తిరిగి జమైకాకు వచ్చిన క్రమంలో మూడేళ్ల పాటు కాంటాక్ట్‌ కుదుర్చుకున్నాడు. తన సీపీఎల్‌ కెరీర్‌ను హోమ్‌ టౌన్‌ ఫ్రాంచైజీతోనే ముగించాలనే ఉద్దేశంతోనే జమైకాకు ఆడుతున్నానని గేల్‌ తెలిపాడు. అయితే తాజా సీజన్‌లో గేల్‌ను జమైకా తలవాస్‌ వదిలేసుకుంది.

విచిత్ర‌మైన జ‌ట్టును ఎప్పుడూ చూడలేదు:

విచిత్ర‌మైన జ‌ట్టును ఎప్పుడూ చూడలేదు:

జ‌మైకా త‌ల్ల‌వాస్ లాంటి విచిత్ర‌మైన జ‌ట్టును ఎప్పుడూ చూడలేదు అని విండీస్ స్టార్ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్ అన్నాడు. 'నేను ప్రాతినిథ్యం వహించిన అన్ని జట్లలోకెల్లా జమైకా తలవాస్‌ విచిత్ర‌మైన‌ది. ఇది ఒక చెత్త ఫ్రాంచైజీ. ఇలాంటి ఫ్రాంచైజీని గతంలో నేనెప్పుడు చూడలేదు. అయితే ఇవి నేను ఊరికే చేస్తున్న ఆరోప‌ణ మాత్రం కాదు. ఆ జ‌ట్టుతో క‌లిసి చాలాకాలంగా కొనసాగుతున్నా. అంతే కాదు ఒక‌ప్పుడు లీడ‌ర్ టీమ్‌లో మెంబ‌ర్‌గానూ ఉన్నా. వారి ఆలోచ‌నా ధోర‌ణిని ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించా. ఆ జ‌ట్టు త‌ర‌ఫున ఆడ‌టం కంటే.. ఊరుకోవ‌డం ఉత్త‌మం. ఇప్పటికైనా యాజ‌మాన్య తీరు మార‌క‌పోతే ఆ జ‌ట్టు మ‌నుగ‌డ క‌ష్ట‌మే' ర‌సెల్ పేర్కొన్నాడు.

Story first published: Friday, May 1, 2020, 16:51 [IST]
Other articles published on May 1, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+