ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 సీజన్‌లో భారత ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్(Mayank Yadav) అదరగొట్టాడు. కానీ అతను కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. గాయంతో మిగతా మ్యాచ్ లు ఆడలేకపోయాడు. మయాంక్ యాదవ్ ఐపీఎల్ లో 150 kmph బౌలింగ్ చేశాడు. దీంతో అతన్ని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్ వస్తుంది. మయాంక్ యాదవ్ ఐపీఎల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆడితే అతని ఆటపై ఒక అంచనా వచ్చే వారు. కానీ అతను కేవలం మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడాడు.
అయితే డిసెంబరులో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌కు నాల్గో సీమర్‌ను ఎవరు అనేదాని చర్చకొనసాగుతోంది. మయాంక్ యాదవ్ నాల్గో బౌలర్ గా తీసుకోవాలని డిమాండ్ వస్తుంది. మయాంక్ ఐపీఎల్ నాలుగు మ్యాచ్ ల్లో 6.98 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు. అయితే అతను 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుండడంతో గాయాల పడే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు. జాతీయ జట్టులోకి మయాంక్ యాదవ్ ను తీసుకోవడానికి సంబందించి బీసీసీఐ కార్యదర్శి జై షా స్పందించారు.

"మయాంక్ యాదవ్ జట్టులో ఉంటాడో లేదో గ్యారెంటీ లేదు కాబట్టి నేను మీకు ఎలాంటి సమాధానం చెప్పలేను. కానీ అతను మంచి ఫాస్ట్ బౌలర్, మేము అతనిని చూసుకుంటున్నాము. అతను ప్రస్తుతం NCAలో ఉన్నాడు" అని జై షా ఎక్స్ లో పోస్ట్ చేశాడు. మయాంక్ యాదవ్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీ(NCA)లో ప్రాక్టిస్ చేస్తున్నాడు. రాబోయే రంజీ సీజన్ సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మయాంక్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫ్రాంచైజీ వేలంలో రూ.20 లక్షలకు తీసుకున్న తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ కోసం మయాంక్ ఈ సంవత్సరం ప్రారంభంలో IPLలో అరంగేట్రం చేశాడు. అతను సీజన్‌లో LSG కోసం నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 6.99 ఎకానమీ వద్ద ఏడు వికెట్లు తీశాడు. అదే సమయంలో IPL చరిత్రలో 156.7kmph వేగంతో నాల్గవ-వేగవంతమైన డెలివరీని నమోదు చేశాడు. సెప్టెంబర్ 5 నుంచి 24 మధ్య జరిగే 2024 దులీప్ ట్రోఫీ మొదటి రౌండ్ కోసం మయాంక్ యాదవ్ ను ఎంపిక చేయలేదు.
ఆస్ట్రేలియా జరగబోయే టెస్ట్ సిరీస్ గురించి మాజీ అటగాడు వసీం జాఫర్ ఎక్స్ లో స్పందించాడు. "ఫాస్ట్ బౌలింగ్ త్రయం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఫిట్‌గా ఉన్నారు. టూర్‌కు నాల్గవ సీమర్‌గా అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్ మధ్య పోటీ ఉండే అవకాశం ఉందని జాఫర్ చెప్పారు.
"బుమ్రా, షమీ, సిరాజ్ ఫిట్‌గా ఉండి, సిరీస్‌లో ఎక్కువ భాగం ఆడగలిగితే అర్ష్‌దీప్ ఎడమ చేతి బౌలర్ గా తీసుకుంటారు" అని జాఫర్ పోస్ట్ చేసారు.