న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ఒకట్రెండు నెలలు రెస్ట్ తీసుకో ప్లీజ్.. నిన్ను ఇలా చూడలేకపోతున్నాం

jaffer suggests that kohli should take rest one or two months

ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2022లో విరాట్ కోహ్లీ తీవ్రంగా నిరాశపర్చుతున్నాడు. నిన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో డకౌట్‌తో కోహ్లీ వరుసగా ఈ సీజన్లో రెండుసార్లు డకౌట్ అయ్యాడు. ఆడిన 8మ్యాచ్‌లలో కేవలం 17సగటుతో 119పరుగులు మాత్రమే చేశాడు. కోహ్లీ ప్రస్తుత ప్రదర్శన, అతనిపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా.. కొన్ని రోజులు కోహ్లీ రెస్ట్ తీసుకోవాలంటూ పలువురు క్రికెట్ దిగ్గజాలు సూచిస్తున్నారు. ఇటీవలే రవిశాస్త్రి సైతం కోహ్లీకి రెస్ట్ అవసరం అంటూ పేర్కొన్న సంగతి తెలిసందే. తాజాగా ఈ విషయంపై భారత మాజీ బ్యాటర్ వసీం జాఫర్ కూడా తన అభిప్రాయం ప్రకారం.. కోహ్లీకి రెస్ట్ చాలా అవసరమంటూ వెల్లడించాడు.

ప్రాక్టీస్ ఒకే కానీ.. మ్యాచ్ టైంలో టచ్ కోల్పోతున్నాడు

ప్రాక్టీస్ ఒకే కానీ.. మ్యాచ్ టైంలో టచ్ కోల్పోతున్నాడు

ఈ సీజన్‌లో విఫలమవుతున్న కోహ్లీ ప్రస్తుత ఫామ్‌ను చూస్తుంటే చాలా నిరుత్సాహంగా ఉందని జాఫర్ అన్నాడు. కోహ్లీ తన ప్రాక్టీస్ సెషన్లలో మంచి ప్రదర్శననే నమోదు చేస్తున్నాడు కానీ.. మ్యాచ్ జరుగుతున్నప్పుడు మాత్రం తన టచ్ కోల్పోతున్నాడని అభిప్రాయపడ్డాడు. కోహ్లీ మ్యాచ్ టైంలో ఒత్తిడికి లోనుకాకుండా, తనను తాను కాస్త రిలీఫ్ చేసుకోవడానికి ఒకటి లేదా రెండు నెలలు విశ్రాంతి తీసుకుని, రిలాక్స్‌గా మళ్లీ ఆట మొదలుపెట్టాలని జాఫర్ సూచించాడు.

ఫిజికల్‌గా కంటే మైండ్‌తోనే ఎక్కవ చేయాలి

ఫిజికల్‌గా కంటే మైండ్‌తోనే ఎక్కవ చేయాలి

జాఫర్ కోహ్లీ విషయమై ఓ ఛాన‌ల్‌తో మాట్లాడుతూ.. 'ఫిజికల్‌గా కష్టపడాల్సినదాని కంటే ఇప్పుడు కోహ్లీ మైండ్‌తో చేయాల్సిందే ఎక్కువ ఉంది. కోహ్లీని ఇలాంటి ఫామ్‌లో చూడటం చాలా నిరుత్సాహంగా ఉంది. కోహ్లీ ఎలాంటి ఆటగాడో మనందరికీ తెలుసు. అతను మళ్లీమళ్లీ విఫలమవడం, ఫామ్ అందుకోవడం కోసం ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీ తీవ్రంగా శ్రమించడం చాలా బాధగా అనిపిస్తోంది. నేను అతనికి ఇచ్చే సలహా అయితే.. ఒకట్రెండు నెలలు కోహ్లీ బ్రేక్ తీసుకోవాలి. అది అతనికి కాస్త ఉపశమనం కలిగిస్తుంది. ప్రస్తుతం నెట్స్‌లో కోహ్లీ ఎక్కువ చెమటోడ్చడం కంటే కాస్త విరామం తీసుకోవడమే ఉత్తమంగా ఉంటుంది.' అని పేర్కొన్నాడు.

నంబర్-5 స్థానంలో దిగితే బెటర్

నంబర్-5 స్థానంలో దిగితే బెటర్

'కోహ్లీ నంబర్ 5స్థానంలోనూ బ్యాటింగ్ చేయగలడని నాకు నమ్మకం ఉంది.. కొన్ని మ్యాచ్‌ల్లో ఆ పొజిషన్లో ఆడి ఆ తర్వాత.. తిరిగి 3వ స్థానంలోకి మారితే బెటర్. ఎందుకంటే కోహ్లీ క్రీజులోకి వచ్చిన ప్రతిసారీ, అతను ఎక్కువ స్వింగ్ బంతులనే ఎదుర్కొంటున్నాడు. అతను 5వ స్థానంలో వస్తే.. బౌలర్ల స్వింగ్ కాస్త తగ్గుతుంది.. అప్పుడు కాస్త తన బ్యాటింగ్‌ను గాడిలో పెట్టే ఇన్నింగ్స్ ఆడవచ్చు. గాడిలో పడ్డాక.. తన ఫేవరేట్ బ్యాటింగ్ ఆర్డర్ అయిన నంబర్ 3స్థానానికి మారవచ్చు. కోహ్లీ ఇప్పటికే అన్ని ఫార్మాట్లలో కలిపి ఒక్క సెంచరీ లేకుండా 100ఇన్నింగ్స్‌లు ఆడాడు. ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేయర్‌గా పేర్కొనే కోహ్లీ లాంటి ప్లేయర్‌కు ఇది మింగుడుపడని విషయం.' అని జాఫర్ పేర్కొన్నాడు.

Story first published: Sunday, April 24, 2022, 16:09 [IST]
Other articles published on Apr 24, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X