డబుల్ సెంచరీకి చేరువగా జాఫర్
కోల్ కత్తా: వసీం జాఫర్ అద్భుతమైన బ్యాటింగుతో భారత్ పాకిస్తానుతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ తొలి రోజు శుక్రవారం భారీ స్కోర్ చేసింది. శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి తొలి ఇన్నింగ్సులో 352 పరుగులు చేసింది. జాఫర్ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. అతను 192 పరుగులతో, గంగూలీ 17 పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. ఆదిలోనే దినేష్ కార్తిక్ అవుటవ్వడంతో దెబ్బ తిన్న భారత్ ను జాఫర్, ద్రావిడ్ పటిష్ట స్థితికి నడిపించారు. వాసిం జాఫర్‌తో కలిసి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా జట్టును పటిష్ట స్థితికి తీసుకువచ్చిన సచిన్ టెండుల్కర్ ఎట్టకేలకు కనేరియా బంతికి క్లీన్ బౌల్డ్‌గా పెవిలియన్ బాట పట్టాడు. దీంతో కోల్‌కతాలో పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. సచిన్ 82 పరుగులు చేశాడు. ద్రావిడ్ 50 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అపుటయ్యాడు.అంతకుముందు టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ అనిల్ కుంబ్లే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కార్తిక్ మరోసారి విఫలం కావడంతో భారత్ ప్రారంభంలోనే కష్టాల్లో చిక్కుకుంది. షోయబ్ తన్వీర్ విసిరిన బంతికి యూనిస్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చిన దినేశ్ కార్తీక్(1) పెవిలియన్ బాట పట్టాడు. రెండో వికెట్‌కు జాఫర్ (83 నాటౌట్)తో కలసి 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన అనంతరం డానిష్ కనేరియా బౌలింగ్‌లో కీపర్ క్యాచ్ ద్వారా ద్రావిడ్ నిష్క్రమించాడు. జాఫర్ 150 బంతుల్లో 17 బౌండరీల సాయంతో సెంచరీ చేశాడు. తన్వీర్ కు ఒక వికెట్ లభించగా, స్పిన్ బౌలర్ కనేరియాకు రెండు వికెట్లు లభించాయి. జ్వరంతో బాధ పడుతూ కూడా అక్తర్ బౌలింగ్ చేశాడు.
Story first published: Friday, November 30, 2007, 23:53 [IST]
Other articles published on Nov 30, 2007
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications