Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న జడేజా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

Jadeja super bowling in first INDvsAUS Test

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఆసీస్ జట్టులో కీలకమైన వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

లంచ్ తర్వాత ఆసీస్ జట్టును ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్ అతనే కావడం గమనార్హం. లంచ్ వరకు భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్న మార్నస్ లబుషేన్, స్టీవెన్ స్మిత్ ఇద్దరినీ జడ్డూ పెవిలియన్ చేర్చాడు.

ఆరంభం అదుర్స్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్‌లో శుభారంభం దక్కలేదు. ఆ జట్టు ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (1), ఉస్మాన్ ఖవాజా (1) ఇద్దరూ సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరారు. సిరాజ్ ఈ మ్యాచ్‌లో వేసిన తొలి బంతికే ఎల్బీడబ్ల్యూగా ఖవాజా అవుటయ్యాడు. ఆ మరుసటి ఓవర్లోనే అద్భుతమైన డెలివరీతో వార్నర్‌ను షమీ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 2 పరుగలకే ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయిన ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. అయితే లబుషేన్, స్మిత్ ఇద్దరూ మరో వికెట్ పడకుండానే లంచ్ వరకు ఇన్నింగ్స్ కొనసాగించారు.

లంచ్ తర్వాత మారిన సీన్

స్మిత్, లబుషేన్ ఇద్దరూ భారత స్పిన్నర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. దీంతో ఆసీస్ జట్టు మెరుగైన స్కోరు చేసేలా కనిపించింది. అయితే లంచ్ తర్వాత ఆ సీన్ మారిపోయింది. వ్యక్తిగత స్కోరు 49 వద్ద జడేజా వేసిన బంతిని ముందుకొచ్చి భారీ షాట్ ఆడేందుకు లబుషేన్ ప్రయత్నించాడు. అతను మిస్సవడంతో బంతి వెనక్కు వెళ్లింది. దాన్ని చటుక్కున అందుకున్న అరంగేట్రం ఆటగాడు కేఎస్ భరత్.. వెంటనే వికెట్లను కూల్చాడు. దీంతో 82 పరుగుల భాగస్వామ్యం విడిపోయింది. ఆ మరుసటి బంతికే కొత్త బ్యాటర్ రెన్‌షా (0)ను ఎల్బీగా జడేజా అవుట్ చేశాడు.

స్మిత్ కూడా జడ్డూకే..

జడేజా బౌలింగ్‌లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును ఆదుకునే బాధ్యత స్టీవ్ స్మిత్ (37)పై పడింది. అతను చక్కగానే బ్యాటింగ్ చేశాడు. అయితే జడ్డూ అతన్ని బోల్తా కొట్టించాడు. అప్పటి వరకు ఆఫ్‌సైడ్ స్పిన్ చేసిన అతను.. సడెన్‌గా స్ట్రెయిట్ డెలివరీ వేశాడు. దాన్ని అంచనా వేయలేకపోయిన స్మిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తను అవుటైన విధానాన్ని అతనే నమ్మలేకపోయాడు. జడ్డూ అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో ఆస్ట్రేలియా జట్టు ఆత్మరక్షణలో పడిపోయింది. అలెక్స్ క్యారీ (12 నాటౌట్), హాండ్స్‌కోంబ్ (20 నాటౌట్) నిదానం ఆడుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. జడేజా బౌలింగ్ చూసిన అభిమానులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. సోషల్ మీడియాలో పాత పద్ధతిలో 'సర్ జడేజా' అంటూ తెగ పోస్టులు చేస్తున్నారు.

Story first published: Thursday, February 9, 2023, 13:31 [IST]
Other articles published on Feb 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+