న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కారుకు ప్రమాదం జరిగింది. జడేజా తన భార్య రీవా సోలంకితో పాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ కారు వెనకవైపు నుంచి ఒక స్కూటీని ఢీ కొట్టింది. ఈ ఘటనలో జడేజా దంపతులకు ప్రమాదమేమీ కాలేదు.
అయితే విద్యానగర్‌లో చదువుకుంటున్న ప్రీతీ శర్మ అనే విద్యార్ధినికి మాత్రం ఈ ప్రమాద ఘటనలో గాయాలయ్యాయి. జడేజా వెంటనే ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లినట్టు సమాచారం. ఆమెకు స్వల్పగాయాలు మాత్రమే అయ్యాయని, ఎటువంటి ప్రమాదం కాలేదని సమాచారం.

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 28 సంవత్సరాల జడేజాకు సెలక్షన్ కమిటీ విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. దాంతో అతను తన సొంత నగరం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్నాడు. రవిచంద్రన్ అశ్విన్‌కు కూడా సెలెక్టర్లు విశ్రాంతినిచ్చాడు.
వారిద్దరి స్థానంలో అమిత్ మిశ్రాను, పర్వేజ్ రసూల్‌లను తీసుకున్నారు. గురువారం బెంగళూరులో జరిగిన తొలి ట్వంటీ20 మ్యాచులో ఇంగ్లాండుపై ఇండియా ఓడిపోయింది.