Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ ఇద్ద‌ర్నీ ప‌క్క‌న పెట్ట‌డ‌మే బెట‌ర్‌: టీమిండియాకు కెవిన్ స‌ల‌హా! ఫైన‌ల్ ఆడ‌బోయేది వాళ్లే!

ICC Cricket World Cup 2019 : 'Jadeja Has To Play For Indian Team In Semi-Final' Says Kevin Pietersen
Jadeja has to play in this Indian team in the semi-final, says Kevin Pietersen


లండ‌న్‌: ప్ర‌తిష్ఠాత్మ‌క ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్‌లో సెమీఫైన‌ల్ ఆడ‌టానికి భార‌త క్రికెట్ జ‌ట్టు సన్నాహాలు చేస్తోంది. మాంచెస్ట‌ర్‌లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ స్టేడియంలో మంగ‌ళ‌వారం కోహ్లీసేన.. తొలి సెమీఫైన‌ల్‌లో కివీస్‌ను ఢీ కొట్ట‌బోతోంది. దీనికోసం ముమ్మ‌రంగా నెట్ ప్రాక్టీస్ చేస్తోంది టీమిండియా. సెమీస్ ఆడ‌బోయే జ‌ట్టు కూర్పు ఎలా ఉండ‌బోతోంద‌నేది ఇంకా తేలాల్సి ఉంది. దీనికి ఇంకా స‌మ‌య‌మూ ఉంది. ఈ నేప‌థ్యంలో- ఇంగ్లండ్ మాజీ డాషింగ్ ఓపెన‌ర్ కెవిన్ పీట‌ర్‌స‌న్ టీమిండియాలో మార్పులు చేర్పుల‌పై ఉచిత స‌ల‌హా ఇచ్చారు. చివ‌రి లీగ్ మ్యాచ్ ఆడిన జ‌ట్టుతోనే ఆడ‌టం స‌రికాద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. జ‌ట్టులో మార్పులు చేయాల‌ని సూచించారు.
కుల్‌దీప్ యాద‌వ్‌, దినేష్ కార్తిక్‌ల‌ను ప‌క్క‌న పెట్టండి..

కుల్‌దీప్ యాద‌వ్‌, దినేష్ కార్తిక్‌ల‌ను ప‌క్క‌న పెట్టండి..

ఆఫ్ స్పిన్న‌ర్‌, చైనామ‌న్ కుల్‌దీప్ యాద‌వ్‌, మిడిలార్డ‌ర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తిక్‌ల‌ను తుది జ‌ట్టులో తీసుకోకూడ‌ద‌ని పీట‌ర్‌స‌న్ సూచించారు. వారిద్ద‌రినీ ప‌క్క‌న పెట్టాల‌ని అన్నారు. వారి స్థానంలో ఆల్‌రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, ఫాస్ట్ బౌల‌ర్ మ‌హ‌మ్మ‌ద్ ష‌మీల‌ను తీసుకోవాల‌ని చెప్పారు. ఫ‌లితంగా జ‌ట్టు స‌మ‌తుల్యం బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్దారు. అటు బ్యాట్‌తో, ఇటు బంతితో రాణించే స‌త్తా ర‌వీంద్ర జ‌డేజాకు ఉంద‌ని కితాబిచ్చారు. జ‌ట్టులో మెరుగైన ఫీల్డ‌ర్ కూడా అత‌డేన‌ని చెప్పారు. ఈ టోర్న‌మెంట్‌లో ఫామ్‌లో ఉన్న మ‌హ‌మ్మ‌ద్ ష‌మీని తుది జ‌ట్టులో తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. తాను ఆడిన నాలుగు మ్యాచుల్లో 14 వికెట్ల‌ను ప‌డ‌గొట్టాడ‌ని, సెమీఫైన‌ల్‌లో కూడా ప్ర‌భావం చూపుతాడ‌ని చెప్పారు. ర‌వీంద్ర జ‌డేజా, ష‌మీ చేరిక వ‌ల్ల బౌలింగ్ విభాగం కూడా బ‌లోపేత‌మౌతుంద‌ని కెవిన్ సూచించారు.

ఫైన‌ల్ ఆడేది.. ఇంగ్లండ్‌-భార‌త్‌

ఫైన‌ల్ ఆడేది.. ఇంగ్లండ్‌-భార‌త్‌

ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ ఫైన‌ల్ మ్యాచ్ ఆడ‌బోయేది భార‌త్‌, ఇంగ్లండ్ జ‌ట్లేన‌ని కెవిన్ అంచ‌నా వేశారు. ఫైన‌ల్‌లో మ్యాచ్ గెల‌వ‌డానికి ఇంగ్లండ్‌కు చ‌క్క‌ని అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అయిన‌ప్ప‌టికీ- త‌న ఆప్ష‌న్ మాత్రం టీమిండియానేన‌ని అన్నారు. శుక్ర‌వారం జ‌రిగే రెండో సెమీ ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు ఆస్ట్రేలియాను ఓడిస్తుంద‌ని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేశారు. సెమీస్‌లో ఇంగ్లండ్ జ‌ట్టు చేతిలో ఆసీస్‌కు ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని అన్నారు. ఇదివ‌ర‌కు ఇంగ్లండ్ మాజీ కేప్టెన్ మైఖెల్ వాఘ‌న్, గూగుల్ ముఖ్య కార్య‌నిర్వ‌హ‌ణాధికారి సుంద‌ర్ పిచాయ్‌ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. ఇంగ్లండ్ ఫైన‌ల్‌కు చేరుకుంటుంద‌ని ఆయ‌న అప్ప‌ట్లో అంచ‌నా వేశారు.

టీమిండియా అభిమానుల గుస్సా!

టీమిండియా అభిమానుల గుస్సా!

కెవిన్ పీట‌ర్‌స‌న్ చేసిన ఈ సూచ‌న‌ల‌పై టీమిండియా అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఏక‌ధాటిగా ఆయ‌న‌ను ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి సూచ‌న‌లు, ఉచిత స‌ల‌హాలేవో ఇంగ్లండ్ జ‌ట్టుకు ఇచ్చుకోవాల‌ని చుర‌క‌లు అంటిస్తున్నారు. ట్వీట్ల‌తో కెవిన్ పీట‌ర్‌స‌న్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు.

Story first published: Monday, July 8, 2019, 13:02 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+