Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సగం గడ్డం, మీసంతో కల్లిస్‌.. ఎందుకో తెలుసా?!

Jacques Kallis shaved exactly half of his beard & moustache, social media storm


న్యూఢిల్లీ:
దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్‌ జాక్వస్‌ కల్లిస్‌ తెలియని క్రికెట్‌ అభిమానికి ఉండడు. కల్లిస్‌ బ్యాట్, బంతితో అంతలా తన ప్రభావాన్ని చూపాడు. రిటైర్మెంట్ అనంతరం ఐపీఎల్‌లో ఆడాడు. ఆ తర్వాత పలు మ్యాచ్‌లకు వ్యాఖ్యానం కూడా చేసాడు. చాలా కాలంగా కనిపించని కల్లిస్‌.. బుధవారం ఒక ఫోటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి వార్తల్లో నిలిచాడు.
సేవ్‌ ద రైనో చాలెంజ్‌ కోసం:

సేవ్‌ ద రైనో చాలెంజ్‌ కోసం:

కల్లిస్‌ సగం గడ్డం, మీసంతో ఉన్న ఫొటోను తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలలో షేర్‌ చేయడంతో.. అది కాస్తా వైరల్ అయింది. ఇంతకు కల్లిస్‌ సగం గడ్డం, మీసంతో ఎందుకు ఎందుకు ఉన్నాడని అభిమానులు అనుకుంటున్నారు. మరేమి లేదు.. ఓ చాలెంజ్‌లో భాగంగా సగం గడ్డం, మీసంతో కనిపించాడు. దక్షిణాఫ్రికాలో అంతరించిపోతున్న ఖడ్గ మృగాల సంరక్షణలో భాగంగా 'సేవ్‌ ద రైనో' చాలెంజ్‌ను స్వీకరించిన కల్లిస్‌.. ఈ కొత్త రూపంతో అభిమానులను రంజింపజేశాడు.

మంచి కారణం కోసమే:

'కొన్ని రోజులు ఆసక్తికరంగా మారబోతున్నాయి. అన్నీ మంచి కారణం కోసమే. ఖడ్గమృగాలు, గోల్ఫ్ అభివృద్ధి కోసమే' అని కల్లిస్‌ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో రాశారు. 'కొన్ని రోజులు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి' అని ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చారు. కట్‌మేకర్, డన్‌హిల్‌చాంప్స్, లియోపార్డ్‌క్రీసీసీ, చారిటీ అని హాష్ టాగ్స్ పెట్టారు. ఈ నెల చివరి వరకు కల్లిస్‌ ఇలానే ఉండనున్నారు.

కల్లిస్‌ అద్భుతం:

కల్లిస్‌ అద్భుతం:

44 ఏళ్ల కల్లిస్‌ ఫోటోపై క్రికెట్ అభిమానులు పాజిటివ్‌గా కామెంట్లు చేస్తున్నారు. 'కల్లిస్‌ గ్రేట్' అని ఓ అభిమాని కామెంట్ చేయగా.. 'కల్లిస్‌ గుడ్ హ్యూమన్ బీయింగ్' అని మరో అభిమాని కామెంట్ చేసాడు. 'కొత్త లుక్‌లో కల్లిస్‌ సూపర్', 'కల్లిస్‌ అద్భుతం' అని ఫ్యాన్స్‌ కొనియాడుతున్నారు. 'సేవ్ ది రినో' అనేది ఒక లాభాపేక్షలేని స్వచ్చంద సంస్థ. ఈ సంస్థ జంతువులను రక్షించే దిశగా పనిచేస్తుంది.

టెస్టుల్లో 13,289 పరుగులు, 292 వికెట్లు:

టెస్టుల్లో 13,289 పరుగులు, 292 వికెట్లు:

దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో, వన్డేల్లో 10వేలకు పైగా పరుగులు, 250కి పైగా వికెట్లను సాధించిన ఏకైక క్రికెటర్‌ కల్లిస్‌. దక్షిణాఫ్రికా తరఫున కల్లిస్‌ 166 టెస్టులు, 328 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 13,289 పరుగులు, 292 వికెట్లు.. వన్డేల్లో 11,579 పరుగులు 273 వికెట్లు.. టీ20 666 పరుగులు, 12 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు.

Story first published: Friday, November 29, 2019, 16:48 [IST]
Other articles published on Nov 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+