For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా జాక్వెస్‌ కలీస్‌!!

Jacques Kallis appointed England batting consultant for Sri Lanka series

లండన్‌: శ్రీలంక పర్యటనలో ఇంగ్లాండ్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాక్వెస్‌ కలిస్‌ నియమితులయ్యాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం శ్రీలంకలో పర్యటించనున్న ఇంగ్లండ్‌ జట్టుకు కలిస్‌ బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్‌ అండ్ వేల్స్ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇంగ్లాండ్‌ జట్టుకు కలిస్‌ సేవలందించడం ఆనందంగా ఉందని ఈసీబీ తెలిపింది.

వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లీష్‌ జట్టు లంక పర్యటనకు వెళ్లాల్సి ఉంది. జనవరి 14న మొదటి టెస్టు ప్రారంభం కానుండగా.. రెండో టెస్టు జనవరి 22 నుంచి మొదలవనుంది. బ్రిటన్‌లో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ఆదేశానికి విమాన రాకపోకలను ఇతర దేశాలు నిలిపివేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అక్కడ లాక్‌డౌన్ విధించారు. కరోనా వైరస్ మహమ్మారి అనిశ్చితి ఉన్నప్పటికీ ప్రణాళిక ప్రకారమే ముందుకుసాగాలని ఈసీబీ నిర్ణయించింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలోనూ అద్భుతంగా రాణించిన జాక్వెస్‌ కలిస్‌ సేవలను ఉపఖండ పిచ్‌లపై ఉపయోగించుకోవాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది. గత 12 నెలలుగా ఇంగ్లాండ్‌ సేవలందిస్తున్న జోనాథన్ ట్రోట్ మరియు మార్కస్ ట్రెస్కోతిక్ స్థానంలో కలిస్‌ ఎంపికచేయబడ్డాడు. లంక పర్యటన అనంతరం ఇంగ్లండ్‌ జట్టు భారత్‌తో టెస్టు సిరీస్‌ ఆడనుండటం వల్లే కలిస్‌ను సలహాదారుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తున్నది.

గత సంవత్సరం ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-1తో ఓడిపోయింది. దాంతో కలిస్‌ దక్షిణాఫ్రికాకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత కొనసాగలేదు. దక్షిణాఫ్రికా తరఫున ప్రాతినిధ్యం వహించిన 45 ఏళ్ల కలిస్‌ టెస్టుల్లో 55.37 సగటుతో 13,206 పరుగులు సాధించాడు. దాంతో పాటు 292 వికెట్లు పడగొట్టాడు. ఆసియా ఖండంలోనూ మంచి రికార్డే ఉంది. ఈ ప్రాంతంలో 25 టెస్టుల్లో 8 ఎనిమిది సెంచరీలు నమోదు చేశాడు.

Story first published: Tuesday, December 22, 2020, 9:21 [IST]
Other articles published on Dec 22, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+