
హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఓ అభిమాని పుట్టినరోజు కానుకగా రెండు క్యాన్‌ల టీ ఇచ్చాడు. అంతేకాదు 50 ఆటోగ్రాఫ్‌లు ఇస్తానంటే "ఇప్పటికి రెండు చాలు, మిగతావి తర్వాత తీసుకుంటాను" అని అన్నాడు. ఆ అభిమాని ఎవరు కాదు బెంగళూరుకు చెందిన ప్రణవ్ జైన్.
ప్రణవ్ జైన్‌కు ధోని అంటే పిచ్చి. ఎన్నో సార్లు ధోనిని కలిశాడు. తాజాగా ఈ ఏడాది జూన్‌లో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు యో-యో టెస్టు కోసం ధోని బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ధోనని ప్రణవ్ కలిశాడు.
దీంతో తాజాగా ధోనితో తన అనుభవాలను ప్రణవ్ గుర్తు చేసుకున్నాడు. "జాతీయ క్రికెట్ అకాడమీలో ధోనీ ప్రాక్టీస్ చేస్తుంటే మొదటి రోజు కలిశాను. అతనితో ఫొటోలు కూడా దిగాను. ప్రాక్టీస్ అనంతరం ధోని హోటల్‌కు వెళ్లే సమయంలో మరోసారి కలిశా. ధోని పుట్టిన రోజుకు ఇంకా మూడు వారాల సమయం ఉంది" అని చెప్పుకొచ్చాడు.
"అప్పుడు ధోనితో ఇంకా మూడు వారాలు మాత్రమే ఉంది అని అన్నాను. 'ఏమిటి?' అని ధోనీ ప్రశ్నించాడు. ఒకరి పుట్టిన రోజు అని అన్నాను. వెంటనే అతడు 'ఒక సంవత్సరం పెద్దవాడు అయిపోతున్నాడు' అని అన్నాడు. ధోని మాటలకు నాతో పాటు ఆ పక్కన ఉన్న వాళ్లంతా నవ్వారు" అని అన్నాడు.
"మహేంద్ర సింగ్ ధోనికి టీ అంటే చాలా ఇష్టం. అందుకే రెండు క్యాన్‌ల టీని పుట్టిన రోజు కానుకగా ఇచ్చాను. అప్పుడు ధోని '50 ఆటోగ్రాఫ్‌లు ఇస్తాను తీసుకో' అన్నాడు. ఇప్పుడు రెండు చాలు.. మిగతా 48 తర్వాత తీసుకుంటానని అన్నాను" అప్పటి ప్రణవ్ జైన్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. ధోని కూడా ఇదే పర్యటనలో ఉన్నాడు. ఇప్పటికే మూడు టీ20ల సిరిస్‌ను ఆతిథ్య ఇంగ్లాండ్‌పై కోహ్లీసేన సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. భారత్-ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం వన్డే సిరీస్ జరుగుతోంది. సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య శనివారం లార్డ్స్ వేదికగా రెండో వన్డే జరగనుంది.