For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫైనల్‌కు దూసుకొచ్చిన పాకిస్తాన్.. మళ్లీ దాయాదుల పోరు!

Asia Cup 2025: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ తుది అంకానికి చేరుకుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మధ్య ఫైనల్ పోరు ఖరారైంది. బుధవారం జరిగిన చివరి సూపర్-4 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై పాకిస్తాన్ విజయం సాధించి, ఫైనల్‌లో తమ స్థానాన్ని పదిలం చేసుకుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న పాకిస్తాన్
భారత జట్టు ఇప్పటికే సూపర్-4 దశలో అగ్రస్థానంలో నిలిచి ఫైనల్‌కు చేరుకోగా.. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో పాకిస్తాన్ రెండో జట్టుగా టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు, బంగ్లాదేశ్ బౌలర్ల ముందు తడబడి, కేవలం 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించగలిగింది. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు మహమ్మద్ హారిస్ (31), మహమ్మద్ నవాజ్ (25) చేసిన కీలక పరుగుల కారణంగానే పాకిస్తాన్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. బంగ్లాదేశ్ తరఫున తస్కిన్ అహ్మద్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టాడు.

It s India vs Pakistan Final Arch-Rivals Set for Asia Cup 2025 Title Showdown

అయితే, 136 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో బంగ్లాదేశ్ తడబడింది. పాకిస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, బంగ్లాదేశ్‌ను నిర్ణీత లక్ష్యం చేరకుండా అడ్డుకున్నారు. బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో షమీమ్ హుస్సేన్ 30 పరుగులతో టార్ స్కోరర్‌గా నిలిచాడు. దీంతో, పాకిస్తాన్ విజయం సాధించి ఫైనల్‌లో భారత్‌తో తలపడే అవకాశాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. సైమ్ ఆయుబ్ రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ నవాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

టైటిల్ కోసం దాయాదుల పోరు
క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఆసక్తికరమైన పోరుగా పరిగణించే భారత్ vs పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం (సెప్టెంబర్ 28) దుబాయ్‌ వేదికగా జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ఇప్పటికే ఇరు జట్లు లీగ్ దశలో ఒకసారి, సూపర్-4 మ్యాచ్ లో రెండో సారి తలపడ్డాయి. ఈ రెండు మ్యాచ్‌‌లలో కూడా భారత్ విజయం సాధించింది. ఇప్పుడుఆసియా కప్ టైటిల్ కోసం జరిగే ఈ మహా సంగ్రామంపై క్రికెట్ అభిమానుల దృష్టి కేంద్రీకృతమై ఉంది. భారత జట్టు తమ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించాలని చూస్తుండగా, పాకిస్తాన్ జట్టు తమ బ్యాటింగ్ వైఫల్యాలను అధిగమించి, ఫైనల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.

సంక్షిప్తంగా:
పాకిస్తాన్: 135/8 (నిర్ణీత 20 ఓవర్లలో)
బంగ్లాదేశ్ : 124/9 (20)

Story first published: Friday, September 26, 2025, 0:06 [IST]
Other articles published on Sep 26, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+